హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై కేటీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ప్రత్యేకంగా హెచ్చరించింది. కేటీఆర్, కొండా సురేఖ మధ్య జరుగుతున్న 100 కోట్ల పరువు నష్టం దావాలో ఈరోజు విచారణ జరిగింది. ఈ సమయంలో, సిటీ సివిల్ కోర్టు కొండా సురేఖకు తీవ్ర హెచ్చరిక చేసింది. ఆమె కేటీఆర్‌పై మరలా ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించింది. ఇంకా, ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది.
అంతేకాక..ఆమె చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచిత్రం అని కోర్టు పేర్కొంది. ఇలాంటి అనర్థక వ్యాఖ్యలు మళ్లీ చేయకూడదని హెచ్చరించింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కోర్టు సూచించింది.