మన అందరికి మెరిసే, ఆరోగ్యవంతమైన చర్మం కావాలనేది సహజమే. కాస్మెటిక్ ఉత్పత్తులవద్దకు వెళ్లకుండా ఇంట్లోని సహజ పదార్థాలతో చర్మాన్ని మెరిపించే ఫేస్ మాస్క్‌లను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ మాస్క్‌లు చర్మానికి హాని లేకుండా సహజ మెరుపు ఇస్తాయి. మీరు ఇంట్లోనే తేలికగా తయారు చేసుకునే కొన్ని ఫేస్ మాస్క్‌ల గురించి తెలుసుకుందాం.
- పసుపు మరియు తేనె మాస్క్
పసుపులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. తేనె చర్మానికి తేమను అందిస్తుంది
అవసరమైన పదార్థాలు: 1 టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ తేనె
తయారీ విధానం : పసుపు మరియు తేనెను కలిపి మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. - ఓట్స్ మరియు పాలు మాస్క్:
ఓట్స్ చర్మాన్ని శుభ్రపరుస్తూ, మృదువుగా చేస్తుంది. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మానికి కాంతి ని ఇస్తుంది.
అవసరమైన పదార్థాలు: 2 టీస్పూన్ ఓట్స్, 1 టేబుల్ స్పూన్ పాలు
తయారీ విధానం : ఓట్స్‌ను పాలలో నానబెట్టి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. - ఆల్మండ్ మరియు నిమ్మకాయ మాస్క్:
ఆల్మండ్ చర్మానికి పోషణనిస్తుంది, నిమ్మకాయలో ఉండే విటమిన్ C చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
అవసరమైన పదార్థాలు: 4-5 ఆల్మండ్లు, 1 టీస్పూన్ నిమ్మరసం
తయారీ విధానం : ఆల్మండ్లను రాత్రంతా నానబెట్టిన తరువాత పేస్ట్‌లా చేయాలి. ఇందులో నిమ్మరసం కలిపి ముఖానికి పూసి 20 నిమిషాలు ఉంచాలి.ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. - బేసన్ మరియు రోజ్‌వాటర్ మాస్క్:
బేసన్ చర్మం నుండి మురికిని తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. రోజ్‌వాటర్ చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది.
అవసరమైన పదార్థాలు: 2 టీస్పూన్ బేసన్, 2 టీస్పూన్ రోజ్‌వాటర్
తయారీ విధానం : బేసన్ మరియు రోజ్‌వాటర్‌ను కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇంట్లో తయారుచేసుకునే ఈ సహజ ఫేస్ మాస్క్‌లు మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా మార్చేందుకు ఎంతో ఉపయోగపడతాయి. కాస్మెటిక్స్ వల్ల చాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అందువలన ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు అవడం వల్ల ఇవి చర్మానికి ఎటువంటి హాని చేయవు. మీరు వీటిని వారంలో 2-3 సార్లు వాడితే మీ చర్మంలో తేడా తక్కువ రోజుల్లోనే కనిపిస్తుంది.