మోడీ , రేవంత్ లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ktr modi

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం. నేను స్పష్టంగా చెబుతున్నా. భయపడేది లేదు. ఈయనకు ఏం తెల్వదు. అనుకోకుండా తంతే గారెల బుట్టలో పడ్డట్లు వచ్చి పడ్డాడు’ అని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డితో పోరాడామని, రేవంత్ రెడ్డి తమకు ఓ లెక్క కాదన్నారు. రేవంత్ రెడ్డితో కొట్లాడేందుకు మనసు రావట్లేదన్నారు.

పాలన చేతకాక పనికిమాలిన మాటలు, పాగల్‌ పనులు చేస్తున్నారని, తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని సీఎం రేవంత్ పై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయిందని చెప్పారు. మూసీ ప్రాజెక్టులో రూ.లక్షా 50 వేల కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించిందని తెలిపారు. బిల్డర్లను, రియ‌ల్టర్లను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసిందన్నారు. మీ బడే భాయ్ మోదీ ఐటీఐఆర్‌ను రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చేయకపోయినా, ఐటీ ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ని పదకొండేండ్ల ముందే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిదని స్పష్టం చేశారు. ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్తన భాండాగార‌మైందని, దేశంలోనే ధాన్యరాశిగా మారిందని తెలిపారు.

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. ‌.. పాగ‌ల్ ప‌నులు. వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది

ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న, అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తుంది…— KTR (@KTRBRS) October 18, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Truecaller appoints ogochukwu onwuzurike as country manager for nigeria biznesnetwork. Clínicas de recuperação para dependentes químicos e alcoólatras. イベントレポート.