టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన మంత్రి తుమ్మల

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టిన బీఆర్ నాయుడును..తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కలిశారు. హైదరాబాద్‌లోని బీఆర్ నాయుడు నివాసంలో మర్యాదపూర్వంగా కలవడం జరిగింది. శ్రీవారి భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్ చేశారు.

తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించాలని.. అలా అనుమతించకుంటే ఎంతవరకైనా వెళతామని ఆ మధ్య కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ నుంచి వచ్చే కృష్ణానది జలాలను వాడుకుంటున్న మీరు.. వెంకన్న స్వామి దర్శనానికి మా ఎమ్మెల్యేల లేఖలను ఎందుకు అనుమతించరో చెప్పాలని డిమాండ్ చేసారు. అందుకే మంత్రి తుమ్మల ..బీఆర్ నాయుడు వద్ద ఆ ప్రస్తావన తీసుకొచ్చారు.

ఇక తాను ఎంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి కీలక పదవిని తాను చేపట్టిన విషయం ఊహకు అందడంలేదని బీఆర్ నాయుడు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు, నారా లోకేశ్ కు, పవన్ కల్యాణ్ కు, మిగిలిన ఎన్డీయే పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

టీటీడీ చైర్మన్ పదవిపై తాను ఆశపడిన మాట వాస్తవమేనని అన్నారు. జీవితంలో ఒక్కసారైనా టీటీడీ చైర్మన్ అవ్వాలి, దేవుడికి సేవ చేయాలని కోరుకున్నానని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటినుంచి తనలో ఈ కోరిక ఉందని, అప్పట్లో ప్రయత్నం కూడా చేశానని, కానీ ఫలించలేదని బీఆర్ నాయుడు వివరించారు. చంద్రబాబును ఒకటిన్నర ఏడాది కింద స్వయంగా అడిగానని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

中国老?. Discover the secret email system…. New 2025 forest river della terra 261rb for sale in monroe wa 98272 at monroe wa dt133 open road rv.