అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..నేడు కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న పవన్ కల్యాణ్

WhatsApp Image 2024 11 11 at 10.56.56

అమరావతి: రెండో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అయింది. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అయితే కాసేపట్లో అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీలో పంచాయతీరాజ్ బిల్లు-2024 ను పెట్టేందుకు పవన్ కల్యాణ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024 ను పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సన్నాహాలు పూర్తి చేశారు.

కాగా, అసెంబ్లీ సమావేశాల్లో ఈ మూడు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ నెల 22 వరకు సమావేశాలు కొనసాగించాలని అసెంబ్లీ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. అయితే ఒకపూటే సమావేశాలు నిర్వహించాలని, బిల్లులు, పలు అంశాలపై చర్చలు జరిపినప్పుడు సాయంత్రం వరకూ సభ నిర్వహించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. మొత్తం సమావేశాల్లో 8 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Retirement from test cricket. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.