వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా పాల్గొనే అంశం ఇంతవరకు స్పష్టతకు రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడం అంత సురక్షితం కాదని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. ఈ విషయాన్ని భారత్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు తెలియజేయగా, ఐసీసీ ఈ సమాచారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా తెలియజేసింది తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనపై ఐసీసీ పీసీబీ అభిప్రాయాన్ని కోరింది. పీసీబీ కూడా దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ హోస్ట్‌గా ఉండొచ్చుకానీ, కొన్ని మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని, ఫైనల్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేయాలనేది ఐసీసీ ప్రణాళిక. భారత్ భద్రత కారణంగా పాకిస్థాన్‌లో ఆడలేని పరిస్థితుల్లో ఈ హైబ్రిడ్ మోడల్ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధానంలో పీసీబీ హోస్టింగ్ ఫీజులను పొందే అవకాశముండగా, ఎక్కువ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరుగుతాయి. అయితే, భారత్ పాకిస్థాన్‌కు రాకపోతే, పాకిస్థాన్ ఆతిథ్యం నుంచి తప్పుకోవాలని నిర్ణయిస్తే, టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశాన్ని ఐసీసీ పరిగణలోకి తీసుకుంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఐసీసీ ప్రతిపాదనపై పీసీబీ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో ఈ విషయంలో మౌనం పాటిస్తోంది. హైబ్రిడ్ మోడల్ గురించి చర్చించేందుకు ఇంకా తగిన సమాచారం కోరే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి.ఐసీసీ ప్రతిపాదనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రాలేదు. హైబ్రిడ్ మోడల్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు మరింత సమాచారం అవసరమని పీసీబీ భావిస్తుండటంతో, ఈ అంశంపై ఐసీసీ నుంచి క్లారిటీ కోరే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి.