ప్రతి రంగంలోనూ కొత్త ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా ఏఐ నిలుస్తుంది: దుద్దిళ్ల శ్రీధర్ బాబు..తెలంగాణ ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో, ప్రీమియర్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లూరా, ఎడ్యుజెనీ మరియు బయోస్టర్ ఉత్పత్తులను భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE: 539607)లో జాబితా చేయబడిన, హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం కలిగిన బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ (బిసిఎస్ ), నాలుగు కృత్రిమ మేధస్సు (ఏఐ)- ఆధారిత ఉత్పత్తులను-బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లురా , ఎడ్యు జెనీ మరియు బయోస్టర్ ని సోమవారం భారతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వినూత్న ఉత్పత్తులను ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఐటి , ఈ&సి , పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో జరిగిన విడుదల కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా గౌరవ అతిథిగా హాజరయ్యారు. బిసిఎస్ చైర్మన్ జానకి యార్లగడ్డ మాట్లాడుతూ, తమ ప్రతి ఉత్పత్తి నిజమైన వైవిధ్యాన్ని కలిగించే పరిష్కారాలను రూపొందించడంలో కంపెనీని నడిపించే వినూత్న స్ఫూర్తిని ఎలా కలిగి ఉంటుందో వివరించారు.
ఈ సందర్భంగా ఐటి మంత్రి మాట్లాడుతూ, “ఆరోగ్య సంరక్షణలో ఏఐ అంటే, సాంకేతికత మాత్రమే కాదు; ఇది జీవితాలను మార్చడానికి సంబంధించినది. కృత్రిమ మేధస్సు యొక్క శక్తిని ఉపయోగించడం ద్వారా, మనం రోగనిర్ధారణను మెరుగుపరచవచ్చు, చికిత్సను వ్యక్తిగతీకరించవచ్చు మరియు మెరుగైన ఫలితాలను సాధించవచ్చు , అంతిమంగా, ఆరోగ్య సంరక్షణను ప్రతి వ్యక్తికి సమర్ధవంతంగా , మరింత అందుబాటులోకి తీసుకురావచ్చు. కలిసికట్టుగా, మనం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నాము” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ఉత్పత్తి డెమోలు నిలిచాయి. ఇవి వాటి వినూత్న ఫీచర్లు మరియు అత్యాధునిక సాంకేతికతల ద్వారా సంబంధిత పరిశ్రమలను మార్చగల సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. వాస్తవ -ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడంలో బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ యొక్క నిబద్ధతలో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. విప్లవాత్మక డిజిటల్ పరిష్కారాలతో భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో ఇది తన విజయాన్ని ప్రదర్శించింది.
బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బిసిఎస్) చైర్మన్ శ్రీమతి జానకి యార్లగడ్డ మాట్లాడుతూ, “ఏఐ అనేది ప్రతి రంగంలోనూ కొత్త సరిహద్దులకు తీసుకువెళ్లడంలో ఉత్ప్రేరకంగా నిలుస్తుంది, ఆవిష్కరణ మరియు సామర్థ్యాన్ని నడిపిస్తుంది. మేము ఏఐని మన దైనందిన జీవితంలోకి మిళితం చేర్చటం ద్వారా, మేము వ్యక్తులు మరియు సంస్థలను తమ పూర్తి సామర్ధ్యాలను ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాము. ఈ సాంకేతికత ఉత్పాదకతను పెంపొందించడమే కాకుండా, సృజనాత్మకత, సహానుభూతి మరియు పురోగతిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. భవిష్యత్ ఆశాజనకంగా వుంది, మానవాళికి ప్రయోజనం కలిగించే విధంగా మనం బాధ్యతాయుతంగా ఏఐ ని ఉపయోగించాలి” అని అన్నారు.
ఈ రోజు విడుదల చేసిన కృత్రిమ మేధస్సు (ఏఐ)- ఆధారిత ఉత్పత్తుల విశేషాలు..
· బ్లూహెల్త్ అనేది చురుగ్గా ప్రజల ఆరోగ్య నిర్వహణను మార్చడానికి రూపొందించబడిన ఏఐ -ఆధారిత మొబైల్ అప్లికేషన్. నాన్-ఇన్వాసివ్ హెల్త్ స్క్రీనింగ్‌లు మరియు సౌకర్యవంతమైన టెలిహెల్త్ ఇంటిగ్రేషన్ అందించడం ద్వారా, బ్లూహెల్త్ ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకువస్తుంది. డేటా రక్షణ మరియు గోప్యత యొక్క అత్యున్నత ప్రమాణాలకు హామీ ఇస్తుంది. వినియోగదారులు అసాధారణమైన ఆరోగ్య ప్రమాణాల కోసం వాస్తవ -సమయ హెచ్చరికలను స్వీకరిస్తారు మరియు వ్యక్తిగతీకరించిన ఆరోగ్య సిఫార్సులను పొందుతారు.
· బ్లురా అనేది ఏఐ – ఆధారిత అంతర్గత మరియు బాహ్య కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్. బ్లురా మరింత అనుసంధానించబడిన మరియు సమాచారంతో కూడిన వర్క్‌ఫోర్స్‌ను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగులు కంపెనీ వార్తలు, అప్‌డేట్‌లు మరియు వనరులను సులభంగా యాక్సెస్ చేయగలరు, వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా కంటెంట్‌ను నిరంతరం మెరుగుపరుచుకోవచ్చు.
· ఎడ్యు జెనీ అనేది ఏఐ ఆధారిత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఈ ప్లాట్‌ఫారమ్ అపరిమిత వీడియో కోర్సులు, ప్రత్యక్ష తరగతులు, టెక్స్ట్ కోర్సులు మరియు ప్రాజెక్ట్‌లను అందిస్తుంది. బోధకులు తమ కోర్సులను సృష్టించవచ్చు మరియు డబ్బు ఆర్జించవచ్చు.
· బయోస్టర్ అనేది దశాబ్దంలో అభివృద్ధి చేయబడిన ఒక విప్లవాత్మక స్టెరిలైజేషన్ ఉత్పత్తి, ఇది సురక్షితమైన మరియు విషరహిత ప్రత్యామ్నాయంగా చేస్తుంది. ఇది ఆసుపత్రులు, జిమ్‌లు, సినిమాహాళ్లు, తరగతి గదులు, గృహాలు మరియు కార్యాలయాలకు అనుకూలంగా ఉంటుంది.