రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ అథ్లెట్

రియో ఒలింపిక్స్-2016లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్న భారత స్టార్ జిమ్నాస్టిక్ అథ్లెట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2011 నేషనల్‌ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో గోల్డ్ మెడల్ సాధించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు దేశంలో అమ్మాయిలను జిమ్నాస్టిక్స్‌ వైపుగా నడిచేలా స్ఫూర్తి నింపింది దీపా. ఆసియన్‌ గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించి.. తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. వరల్డ్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డుకెక్కింది. ఇంకా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇన్ని రికార్డ్స్ నమోదు చేసిన దీపా..జిమ్నాస్టిక్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చింది. సోమవారం ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించింది.

‘చాలా ఆలోచించిన తర్వాత జిమ్నాస్టిక్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం నాకు సులభమైనది కాదు. కానీ, ఇదే సరైన సమయమని భావించా. జిమ్నాస్టిక్స్‌కు నా జీవితంలో పెద్ద పాత్ర పోషించింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. నేను సాధించిన దాని పట్ల గర్వంగా ఉన్నా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం.. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్ ప్రదర్శన మరుపురాని జ్ఞాపకాలు. ఈ ఏడాది ఏషియన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాను. అదే నా చివరి విజయం. అదే కెరీర్‌కు మలుపు. అప్పటి వరకు నా శరీరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలనని అనుకున్నాను. కానీ, కొన్నిసార్లు మన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది.’ అని దీప రాసుకొచ్చింది.

ఇక దీప కర్మాకర్ స్వస్థలం త్రిపురలోని అగర్తల. ఆమె తండ్రి నాన్న శాయ్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ కోచ్‌గా ఉండేవారు. దీపా ఈ పొజిషన్ కు రావడానికి ఎంతో కష్టపడింది. రోజూ 8 గంటలు కష్టపడి ప్రాక్టీస్ చేసేది. 6 ఏళ్ల వయసులో జిమ్నాస్టిక్స్‌లో అడుగుపెట్టిన దీప.. దేశంలో జిమ్నాస్టిక్స్ అంటే దీపనే అనేలా గుర్తింపు పొందింది. అలాంటి దీపా రిటైర్మెంట్ ప్రకటించడం ఫై క్రీడాకారులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *