లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బానుతో విడాకులు తీసుకుంటున్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తామెంతగానో అభిమానించే ఈ జంట ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు జరగవని వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోను షేర్ చేస్తున్నారు.
చిత్రసీమలో సినీ స్టార్స్ ప్రేమించుకోవడం , పెళ్లిళ్లు చేసుకోవడం వెంటనే విడాకులు తీసుకోవడం అనేది కామన్ గా మారింది. షూటింగ్ టైములో హీరో , హీరోయిన్ క్లోజ్ అవ్వడం , ఆ క్లోజ్ కాస్త ప్రేమగా మారడం..ఆ ప్రేమ కాస్త సహజీవననానికి దారితీయడం..ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత కొంతకాలానికే విడిపోవడం అనేది జరుగుతూనే వస్తుంది. కానీ రహమాన్ 29 ఏళ్ల వివాహ బంధానికి తెరదించడం అనేది అభిమానులకు , సినీ ప్రముఖులకు షాక్ కలిగిస్తుంది. తన భర్త, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోతున్నట్లు సైరా స్వయంగా తెలిపి షాక్ ఇచ్చింది.
పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు తెలిపారు. అలానే ఈ దంపతుల తరఫున ప్రముఖ లాయర్ వందనా షా కూడా వీరి డివొర్స్ ప్రకటన విడుదల చేశారు. “ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ, విడాకులు తీసుకునేందుకు రెహమాన్, సైరా బాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో భావోద్వేగపూరిత ఒత్తిడి నెలకొంది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయి” అని లాయర్ వందనా షా పేర్కొన్నారు.
విడాకులపై ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ – “మా పెళ్లి బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని ఆనందించాం. కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుడిని కూడా ప్రభావితం చేస్తాయి. పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవు. అయినా కూడా మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 1995లో రెహమాన్ సైరా వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్యానికి 29 ఏళ్లు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఖతీజా, రహీమా, అమీన్ వీరి సంతానం. సైరాతో వివాహాన్ని తన తల్లి నిశ్చయించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ తెలిపారు.