మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు..ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. జార్ఖండ్‌లో నేడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోcw మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ పోస్టు పెట్టారు. ‘నేటి పోలింగ్‌లో సరి కొత్త రికార్డును సృష్టించాలని’ విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా మోడీ ఒక సందేశం ఇచ్చారు. ‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నాను. యువతీ, యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇకపోతే, జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలకు ఈ నెల 13న తొలి విడత ఓటింగ్ జరగగా, రెండో విడతలో బుధవారం 36 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. Mushroom matar masala ki recipe : indian style.