అర్జున్ ఫ్యామిలీకి భారీ నష్టం..

అల్లు అర్జున్ ఫ్యామిలీ కి భారీ నష్టం వాటిల్లింది. ఇండస్ట్రీ లో అల్లు అరవింద్ అంటే తెలియని వారు ఉండరు. చిరంజీవి బావమరిదిగా , నిర్మాతగా , అల్లు అర్జున్ తండ్రిగా పాపులార్ల్ర్టీ తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలు చేసి భారీ లాభాలు అందుకున్న ఈయన…మొట్టమొదటి తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా పేరుపొందిన ఆహా సంస్థని స్థాపించారు. ఆహా వేదికగా కొత్త చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లను కూడా స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నో రకాల షోలు చేస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తోనే ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇచ్చే విధంగా ఆహా పేరు.. సంపాదించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా నష్టాల బాట పడినట్లుగా తెలుస్తుంది.

2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆహా కి సుమారుగా రూ.105 కోట్ల మేరా నష్టం వచ్చినట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. ఆహా కార్యక్రమాల వల్ల వస్తున్నటువంటి ఆదాయం రూ.133 కోట్లు అవ్వగా.. ఇవే కాకుండా ఇతరత్రా ఆదాయల ద్వారా రూ .4కోట్లను సంపాదించింది అని, మొత్తం మీద రూ.137 కోట్ల వరకు వచ్చింది అని తెలిపింది. కానీ ఖర్చు మాత్రం రూ .207 కోట్లు తేలింది అని , దీని ఫలితంగానే రూ.105 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లుగా తెలియజేసింది. కానీ ప్రస్తుతం అంత సెట్ అయ్యిందని..అప్పటి కంటే ప్రస్తుతం చాలా మెరుగుపడిందని తెలిపింది. 2022-23 లో వచ్చిన ఆదాయం తో పోల్చితే 2023-24 లో ఆదాయం తొమ్మిది శాతం మేరా ఎక్కువగా వచ్చినట్లు తెలిపింది. అప్పుడు రూ .122 కోట్లు ఆదాయం రాగా ..ఇప్పుడు రూ.137 కోట్లు వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఆహా తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా పలు రకాల కార్యక్రమాలను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?ை. 就是幸福鍋?. Früh für die einführung der chatkontrolle bei der eu kommission lobbyiert.