హైదరాబాద్​లో పెరుగుతున్న ఫుడ్​ పాయిజనింగ్ కేసులు

Food poisoning

హైదరాబాద్ మహానగరంలో చాలామంది ఇంట్లో తినడం మానేశారు. బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయి..వంట చేసుకొని తినే బదులు , వంద పెట్టి బయట తింటే సరిపోతుందికదా అని ఫిక్స్ అయ్యారు. ప్రతి రోజు ఏదో పూట బయట తింటూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. బయట ఫుడ్ తినేవారు ఎక్కువైపోవడం తో..ప్రతి గల్లీలో పదుల సంఖ్యలో హోటల్స్ , రెస్టారెంట్స్ , ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ , టిఫిన్ సెంటర్లు దర్శనం ఇస్తున్నాయి. అయితే వీరెవరూ కూడా నాణ్యమైన ఫుడ్ ను అందించకపోయేసరికి తిన్నవారంతా హాస్పటల్ పాలవుతున్నారు. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్​కు చెందిన ఓ మహిళ మోమోస్​ తిని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కల్తీ ఆహారంతో ఇబ్బంది పడుతూ ఉస్మానియా, గాంధీ, ఫీవర్​ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

ఆహార భద్రత అధికారులు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8624 సార్లు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడ చూసినా నాసిరకం, కుళ్లిన ఆహార పదార్థాలను ఫ్రిజుల్లో నిల్వ చేయడం, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించడం, వివిధ రకాల హానికర రంగులు వంటివి వాడటం, వంట గదుల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే వారికి కనిపించింది. ఇలాంటి పరిస్థితులు ఉన్న హోటళ్లలో తింటే, ఆహారం తిన్న తర్వాత గంట నుంచి 36 గంటల వరకు ఎప్పుడైనా ముప్పు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. సాల్మోనెల్లా, క్యాంపిలో బాక్టర్, ఇ.కోలి బ్యాక్టీరియాలు, లిస్టెరియా, నోరోవైరస్‌లు ఫుడ్‌ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. దీంతోపాటు వివిధ రకాల డ్రగ్స్, టాక్సిక్స్‌తో ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై కలుషిత ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు.

ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు:
వాంతులు
విరేచనాలు
కడుపు నొప్పి
జ్వరం
మలబద్ధకం లేదా విరేచనాలు
నీరసం
తలనొప్పి
కారణాలు:
బాక్టీరియా: సాల్మొనెల్లా, ఈ.కోలై, క్లోస్ట్రిడియం.
వైరస్: నోరోవైరస్, రోటావైరస్.
పరాన్నజీవులు: గియార్డియా, క్రిప్టోస్పోరిడియం.
కలుషితమైన ఆహారం: పాడైన ఆహారం, సరిగా వండని మాంసం.
ఆహారంలో విషతుల్యం: పాకించని ఆహారం లేదా కెమికల్ కలుషితాలు.
పరిష్కారాలు:
తాగునీరు: బాగా ద్రవాలను తీసుకోవడం చాలా ముఖ్యం. నీటి డీహైడ్రేషన్‌ను నివారించడానికి ORS లేదా తేనెలో నిమ్మరసం వేసి తాగాలి.
పరిమిత ఆహారం: కడుపుకు మెల్లిగా జీర్ణమయ్యే ఆహారాలు, బ్రెడ్, రైస్ వంటి పదార్థాలు తినండి.
మందులు: వాంతులు లేదా విరేచనాలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు వాడండి.
ప్రతి విధానం: శుభ్రత, పాడిపోయిన ఆహారాన్ని తినకుండా ఉండటం.
నివారణ చిట్కాలు:
ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయండి.
ఆహారాన్ని సరిగ్గా వండాలి.
శుభ్రత పాటించండి.
కాలపరిమితి గడువు ముగిసిన ఆహారాన్ని తినకుండా ఉండండి.
బయట తినే ఆహారంపై జాగ్రత్త వహించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join community pro biz geek. Advantages of overseas domestic helper.       die künstlerin frida kahlo wurde am 6.