ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి పండుగ సందర్భం గా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో నివసిస్తున్న హిందువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు “పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందువులకు నా హృదయపూర్వక ‘దీపావళి’ శుభాకాంక్షలు ప్రత్యేకంగా బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు, మీరు ఎదుర్కొంటున్న కష్టకాలంలో శ్రీరాముడు మీకు శక్తిని మరియు ధైర్యాన్ని అందించాలనే కోరుకుంటున్నాను భారత దేశంలో మేమంతా మీ భద్రత కోసం ప్రార్థిస్తున్నాం ఈ దీపావళి రోజు బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్‌లో హింసకు గురైన హిందువుల భద్రత కోసం అందరమూ ప్రార్థిద్దాం వారి దేశాల్లో ధర్మం పునరుద్ధరించబడాలని ఆకాంక్షిద్దాం” అని పవన్ అన్నారు.
అలాగే, ఆయన ఈ ట్వీట్‌కు అనుబంధంగా సింధి భాషలో పాడుతున్న ఒక బాలుడి పాటకు సంబంధించిన వీడియోని జోడించారు ఆ బాలుడు పాడిన పాట భారత్ నుండి విడిపోతున్న బాధను తెలియజేస్తోంది. పాకిస్థాన్‌లో ఉన్న హిందువులు అనుభవిస్తున్న కష్టాలను ఆ బాలుడి గాత్రం ద్వారా ప్రతిబింబించారని పవన్ అభిప్రాయపడ్డారు ఈ చర్యతో, పవన్ కళ్యాణ్ తమ దేశం నుంచి వలస వెళ్లిన వారిపట్ల ఉన్న అండగా ఉన్న కష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని మాటలు, కష్టాల్లో ఉన్న సమాజానికి సానుకూలంగా ఉండాలనే అభిలాషను ప్రతిబింబిస్తున్నాయి.