పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు

High Court verdict on MLAs who switched parties

హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు సూచించింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంజ్ ఆదేశించింది. స్పీకర్ కు ఏలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు పేర్కొంది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు… స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ స్పీకర్‌ నిర్ణయంపై పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఉంటుంది. ఈ లెక్కన పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందని విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదన్నారు. పిటీషనర్ల తరఫు న్యాయవాదులు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

కాగా, బీఆర్ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జులై 3న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారని.. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్​పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్​ శాసన సభ్యులు పాడి కౌశిక్​ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ு?. 長鈺溫泉?. Was wünschst du dir von einer digitalen zivilgesellschaft für die zukunft ? und was kann jede*r einzelne dazu beitragen ?.