హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని “కార్తీక పౌర్ణమి” అంటారు. ఈ పవిత్రమైన రోజుకు హిందూ సంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ మాసానికి అధిపతి కార్తికేయుడు కావడం వల్ల, దీన్ని కార్తీక మాసం అని పిలుస్తారు. ఈ మాసంలోని పౌర్ణమి రోజు శివపార్వతుల పుత్రుడు కార్తికేయుడిని ఆరాధించడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయి. పండితుల అభిప్రాయం ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజున గంగానదిలో పవిత్ర స్నానం చేయడం, దీపారాధన చేయడం భక్తులకు శుభ ఫలితాలను అందిస్తాయి.గంగానదిలో స్నానం కార్తీక పౌర్ణమి రోజున గంగానదిలో స్నానం చేస్తే పాప విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గంగానది అందుబాటులో లేకుంటే తులసి చెట్టు లేదా రావి చెట్టు వద్ద పూజ చేయడం సమాన ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
దీప దానం సాయంత్రం సంధ్యాసమయంలో శివాలయం లేదా తులసి చెట్టు వద్ద దీపాలను వెలిగించడం పరమ శుభకరం. ఇది శివుడి కృపను ఆకర్షిస్తుందని భక్తుల నమ్మకం.శివ పూజలు కార్తీక పౌర్ణమి రోజున నమక, చమక, ఏకాదశ రుద్రాభిషేకం చేయిస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.అన్నదానం ఈ పవిత్ర దినాన పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా ధార్మికంగా మంచి ఫలితాలు లభిస్తాయి.కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుందని, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తులు విశ్వసిస్తారు. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణం, శివ సహస్రనామం వంటి ఆధ్యాత్మిక పారాయణలు మరింత శ్రేయస్సును అందిస్తాయి. ఈ పర్వదినం హిందూ మత విశ్వాసాలకు మాత్రమే పరిమితం. దయచేసి సంబంధిత నిపుణుల సలహాతో మరింత సమాచారం సేకరించగలరు. ఈ సమాచారం పురాణాలను ఆధారంగా చేసుకుని ఉంది. శాస్త్రీయ ఆధారాలు లేవు. ధార్మిక విశ్వాసాల పరంగా దీన్ని పరిగణించగలరు.