డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

CM Revanth Reddy will go to Maharashtra today

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ ముందు నుండి కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి , డ్రగ్స్ , ఇతర మాదక ద్రవ్యాలపై కూడా ఫోకస్ చేసారు. ఎక్కడిక్కడే నిఘా ఏర్పాటు చేసి , పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చి డ్రగ్స్ అనేది కనపడకుండా చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ప్రతి రోజు పెద్ద ఎత్తున గంజాయి ని పట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడానికి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా జిల్లాల్లోని అన్ని యూనిట్స్ లో ఈ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ పీఎస్ ల తరహాలోనే డ్రగ్స్ సహా ఇతర మాదకద్రవ్యాల కేసులను దర్యాప్తు చేయనున్నాయి. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ పర్యవేక్షణలో ఇందులో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక డీఎస్పీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్ ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

ప్రతి పీఎస్ కు డీఎస్పీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. నార్కొటిక్స్ పీఎస్ లో ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదు కాబడిన కేసులను కూడా వీరు దర్యాప్తు చేస్తారు. అలాగే స్థానికంగా లా అండ్ ఆర్డర్ పీఎస్ లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించనున్నారు. గంజాయి, డ్రగ్స్ కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు సిబ్బందిని నార్కొటిక్స్ పీఎస్‌లో నియమించున్నారు.

గతంలో గంజాయి, డ్రగ్స్ సప్లై చేసిన ముఠాలను విచారిస్తూ అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల డబ్బు సంపాదించే క్రమంలో గంజాయి, డ్రగ్స్ దందా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. కానీ, ఎవరో ఒకరు ఈ వ్యవహారాలు లీక్ చేయడంతో పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. Profitresolution daily passive income with automated apps. 2025 forest river wildwood 42veranda.