వరల్డ్ బెస్ట్ సిటీస్-2025లో ‘లండన్ ’ మొదటిస్థానంలో నిలిచి సత్తా చాటింది. లండన్ తర్వాత న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్.. టాప్-10లో ఉన్నాయి. గత పదేళ్లుగా ఈ జాబితాలో లండన్ నగరమే వరల్డ్ బెస్ట్ సిటీగా ఉండడం విశేషం. రియల్ ఎస్టేట్, టూరిజం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సలహదారుగా ఉన్న రిసోనెన్స్ సంస్థ ఈ వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలను ఈ జాబితా కోసం పరిశీలించారు.
సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, భారీ వ్యాపార మౌలిక సదుపాయాలు, అసమాన జీవన నాణ్యత… లండన్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించాయని రిసోనెన్స్ పేర్కొంది. నివాస యోగ్యత, సంస్కృతి, నగరంలో రాత్రి జీవితం మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఉత్తమ నగరాల ఎంపిక జరిగిందని ర్యాంకింగ్స్ విడుదల చేసిన ‘రిసోనెన్స్ కన్సల్టెన్సీ’ తెలిపింది. కాగా టాప్-100 సిటీస్‌లో భారతీయ నగరాలేవీ లేకపోవటం గమనార్హం. ముంబై, ఢిల్లీ నగరాలకు కూడా ర్యాంకింగ్స్‌లో చోటు దక్కలేదు. ‘31 దేశాల్లో 22వేల మందిని సర్వే చేశాం. నివాస యోగ్యమైనవిగా ముంబై, ఢిల్లీ నగరాలకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. కానీ ప్రపంచ స్థాయిలో ఈ నగరాలు టాప్-100లో లేవు’ అని ‘రిసోనెన్స్ కన్సల్టెన్సీ’ అధ్యక్షుడు, సీఈవో క్రిస్ ఫెయిర్ పేర్కొన్నారు.
లండన్ విషయానికి వస్తే..లండన్ (London) మహానగరం యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క రాజధాని, ఇంగ్లాండ్ లోనే అతి పెద్ద నగరం. ఇప్పటి లండన్, పురాతన లండన్, దాని చుట్టూ ఏర్పడ్డ నగరాల సముదాయం. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది. రాజకీయంగా, వైజ్ఞానికంగా, విద్య, వినోదం, కళలు, ఫ్యాషన్,, ప్రసార మాధ్యమాల్లో ప్రపంచ దేశాలపై దీని ప్రభావం వల్ల ప్రపంచంలో ఒక మహానగరంగా విరాజిల్లుతోంది. ఇది ప్రపంచంలో కెల్లా విస్తీర్ణములో అతి పెద్ద నగరం.
7.5 మిలియన్ల జనాభాతో ఐరోపా యూనియన్లోనే అత్యధిక జనాభాగల నగరంగా గుర్తించబడింది. మెట్రోపాలిటన్ జనాభా సుమారు 12 నుంచి 14 మిలియన్లు. నగరంలో నివసించే ప్రజలు వివిధ జాతుల, మతాల, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడి పౌరులు దాదాపు 300 భాషలు మాట్లాడుతారు. ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఒక నౌకాయన కేంద్రంతో ఇది ప్రధాన అంతర్జాతీయ రవాణాకేంద్రం కూడా. అంతేకాక అతి పెద్ద పౌర విమానయాన కేంద్రం కూడా. లండన్ లోని హీత్రూ విమానాశ్రయం అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను చేరవేయడం