తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థుల పరీక్ష షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 2024, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. హాల్ టికెట్లను డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని.. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.
డిసెంబర్ 15న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుందని ప్రకటించింది. అదేవిధంగా డిసెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్- 4 పరీక్ష నిర్వహిస్తారు.
ప్రతి పేపర్ లో 150 ప్రశ్నలు ఉండగా 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అంతే మొత్తం నాలుగు పేపర్లకు కలిపి 600 మార్కులు ఉండనున్నాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అరగంట ముందే 9.30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలో ఉండాలి. ఆ తరవాత నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు.
గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదలయ్యే సమయంలో సమస్యలు ఏవైనా తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. మొత్తం మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు ఈ గ్రూప్-2 పరీక్షకు అప్లై చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నెలలోనే గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అదే సమయంలో డీఎస్సీ ఎగ్జామ్స్ ఉండటంతో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్షలను చెప్పిన డేట్‌కే నిర్వహించి గ్రూప్-2 పరీక్షలను పోస్ట్‌పోన్ చేసింది.