ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu launched the free gas cylinder scheme

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్దిదారులలో ఒకటైన శాంతమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లి ఆమెకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. అనంతరం జానకమ్మ అనే ఒంటరి మహిళకు పింఛన్ అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

జానకమ్మ సీఎం చంద్రబాబుకు తన సొంత ఇల్లు కట్టించమని కోరారు. ఇందుకు సీఎం హామీ ఇచ్చి.. రేపటి నుంచే మీ ఇంటి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చారు. డ్వాక్రా కార్యక్రమంలో లీడర్‌గా ఉన్నావు కాబట్టి పది రూపాయలు సంపాదించుకోవాలి అని సీఎం జానకమ్మకు సలహా ఇచ్చారు. థైరాయిడ్, డయాబెటిక్ ఉన్న వారికి జనరిక్ మందులు అందుబాటులో ఉంటే చూడాలని కలెక్టర్‌ను సూచించారు. జానకమ్మ మాట్లాడుతూ.. “నేను రూ.500 నుంచి రూ.4000 వరకు అందుకుంటున్నాను. మీరు మాకు దేవుడు” అని సీఎం చంద్రబాబుకు తెలిపారు. 20 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతున్నామని ఆమె చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ద్రబాబు ఆమెను ఓదార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

号美?. ==> click here to get started with auto viral ai. Embrace the extraordinary with the 2025 forest river blackthorn 3101rlok.