మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో, శివసేన నాయకుడు కిరణ్ పావాస్కర్ తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలనీ, భద్రతను కట్టుదిట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి మహారాష్ట్రకు వందల కోట్ల నగదును తరలించే అవకాశం ఉంది” అని తెలిపారు.
ఈ నగదును మహా వికాస్ అఘాడీకి ఖర్చు పెట్టే అవకాశముందని పావాస్కర్ చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ కూడా స్పందించారు, “కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా మార్చింది” అని అన్నారు. అలాగే, “ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల కోసం నిధులు సమకూర్చడం జరుగుతోంద”ని ఆరోపించారు.