ఇప్పటికే జాతీయ జట్టుకు దూరమైన టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది ముంబై రంజీ ట్రోఫీ జట్టులో కూడా అతని స్థానం కోల్పోయాడు టీమ్ మేనేజ్‌మెంట్ అతనిని జట్టులోంచి తీసేయడంపై స్పష్టమైన కారణాన్ని చెప్పకపోయినప్పటికీ ఫిట్‌నెస్ లోపం మరియు క్రమశిక్షణలేమీ ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సంజయ్ పాటిల్ రవి ఠాకూర్ జీతేంద్ర థాకరే కిరణ్ పొవార్ విక్రాంత్ యెలిగేటిల ఆధ్వర్యంలో షాను రంజీ ట్రోఫీ జట్టులోంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పృథ్వీ షా క్రమశిక్షణ సమస్యలు అసోసియేషన్‌కు పెద్ద తలనొప్పిగా మారాయని క్రిక్‌బజ్ పేర్కొంది రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనూ అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అతనికి ఒక పాఠం నేర్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల నెట్ ప్రాక్టీస్‌లకు షా తరచూ ఆలస్యంగా రావడం ప్రాక్టీస్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగించింది పైగా అతను తన ఫిట్‌నెస్‌పై సరైన శ్రద్ధ పెట్టకపోవడం అధిక బరువుతో బాధపడటం కూడా ప్రధాన కారణంగా పేర్కొనబడింది అనేక సీనియర్ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్ శార్దూల్ ఠాకూర్ మరియు కెప్టెన్ అజింక్యా రహానే వంటి వారు నెట్ సెషన్‌లను చాలా గంభీరంగా తీసుకుంటున్నప్పటికీ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని సమాచారం.
ఇతను జట్టులో కొనసాగడంపై నిర్ణయం కేవలం సెలెక్టర్ల దే కాకుండా కోచ్ మరియు కెప్టెన్ కూడా అతని ఆటతీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు షాను జట్టులోంచి తొలగించడం అవసరమని వారు కూడా అభిప్రాయపడ్డారు 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా పృథ్వీ షా భారత్ తరఫున అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు అతని అద్భుత ప్రదర్శనతో అందరి మనసు దోచుకొని భవిష్యత్తులో టీమిండియాకు మంచి ఓపెనర్‌గా ఎదగాలన్న ఆశలను రేపాడు కానీ ఆ తర్వాత అతను తన స్థాయిని నిలుపుకోలేక జట్టులో స్థిరంగా కొనసాగలేకపోయాడు తాజాగా జరుగుతున్న రంజీ సీజన్‌లోనూ షా ఫామ్ విఫలమైంది అతను ఆడిన రెండు మ్యాచ్‌లలో బరోడాపై 7 మరియు 12 పరుగులు మాత్రమే చేయగా మహారాష్ట్రపై 1 మరియు 39 (నాటౌట్) పరుగులు మాత్రమే చేశాడు అతని సహచరులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ షా వివాదాల కారణంగా తన కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.