ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ (IF) అనేది మీరు ఒక నిర్ధిష్ట సమయాన్ని మాత్రమే ఆహారం తీసుకునే పద్ధతి. దీని ప్రకారం మీరు కొంత సమయం భోజనం చేయకూడదు. మరియు ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే తినాలి. ఇది బరువును నియంత్రించడంలో ఆరోగ్యం మెరుగుపరచడంలో మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంలో సహాయపడుతుంది.
ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ పద్ధతులు: IFలో అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో 16/8 పద్ధతి అనేది చాలా పాపులర్. ఈ పద్ధతిలో, 16 గంటలు ఫాస్టింగ్ చేయడం మరియు 8 గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 6 గంటల మధ్య ఆహారం తీసుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. మరియు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
సురక్షితంగా పాటించడం: IFను ప్రారంభించేటప్పుడు నీటి పరిమాణం ఎక్కువగా తీసుకోవడం కాఫీ లేదా టీ వంటి కనిష్ట కేలరీ కలిగిన పానీయాలను ఉపయోగించడం మంచిది. కొందరు వ్యక్తులకు ఫాస్టింగ్ కష్టంగా అనిపించవచ్చు. అందుకని శరీరానికి సరైన సమయం ఇవ్వడం ముఖ్యం.
ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపించగలదు. కానీ మీ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.