తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం

తెలంగాణ లో 09 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌లు నియమితులయ్యారు. తెలంగాణలో చాలా కాలంగా వీసీల పోస్టులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంగా వీసీలు లేకుండా పోయారు. అంతేకాదు ఇన్‌చార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్‌లను నియమించినప్పటికీ వర్సిటీలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. వీసీలు లేక అనేక యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పినట్లైంది.

పలు వర్సిటీల్లో అక్రమాలు జరిగాయని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం దృష్టి సారించి..నేడు వీసీలను నియమించారు. వైస్ ఛాన్సలర్‌ల నియామకపత్రాలపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకాలు చేశారు. దీంతో వీసీలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్ చాన్సలర్లు ఎవరనేది చూస్తే..

  1. ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ – మహబూబ్‌నగర్‌, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌
  2. ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి – కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌
  3. ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్ – హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌
  4. ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ – శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్‌‌కు వైస్ ఛాన్సలర్
  5. ప్రొఫెసర్ నిత్యానందరావు – హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌
  6. ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ – నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌
  7. ప్రొఫెసర్ యాదగిరిరావు – తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్‌కు వైస్ ఛాన్సలర్‌
  8. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య – జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్‌కు వైస్ ఛాన్సలర్‌
  9. ప్రొఫెసర్ రాజి రెడ్డి – శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??江苏老?. Let’s unveil the secret traffic code…. Discover the 2025 forest river cherokee timberwolf 39hbabl : where every journey becomes an unforgettable experience !.