Virat Kohli: బెంగళూరు టెస్టులో విఫలమైనప్పటికీ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

virat kohli ms dhoni

బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు ఈ మ్యాచ్‌లో అతను 9 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔటయ్యాడు అయినప్పటికీ ఈ మ్యాచ్ కోహ్లీకి ఒక అరుదైన రికార్డును అందించింది భారత తరపున అన్ని ఫార్మాట్లలో కలుపుకొని అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు, ఈ క్రమంలో అతను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టాడు ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ 536 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేశాడు ఇది భారత క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధికం 535 మ్యాచ్‌లతో ఎంఎస్ ధోనీ మూడవ స్థానానికి చేరుకోగా అగ్రస్థానంలో మాత్రం ఎవరూ అందుకోలేని రీతిలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు సచిన్ తన కెరీర్‌లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు ఇది ఇప్పటికీ ప్రపంచ రికార్డు విరాట్ ఈ జాబితాలో ధోనీని దాటడం అతని సుదీర్ఘ కెరీర్‌కు మరో తీపి క్షణంగా నిలిచింది.

ఈ జాబితాలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ మాత్రమే క్రియాశీలకంగా క్రికెట్ ఆడుతున్నారు మిగతా ఆటగాళ్లు రిటైర్ అయ్యారు కోహ్లీ ఇప్పటికీ తన కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, సచిన్ టెండూల్కర్ అత్యధిక మ్యాచ్‌ల రికార్డు (664) చేరుకోవడం సులభం కాదు. ఇది సాధించాలంటే విరాట్ తన ఫిట్నెస్‌ను కొన్నేళ్ల పాటు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోహ్లీ జాతీయ జట్టులో కీలక స్థానం పొందినప్పటికీ, అతని రికార్డు ఎంత దూరం వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

分钟前. Let’s unveil the secret traffic code…. Why the kz durango gold stands out :.