హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ఇవాళ కోర్టు విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన ఇతర పనుల రీత్యా హాజరుకాలేకపోయారు.
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ”కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్‌లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి” అని స్పష్టం చేసింది.