హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాక్‌గా మారాయి. ఈ ఫలితాలను తాము అంగీకరించమని, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది.
కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని తెలిపింది. మరో 13 సెగ్మెంట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు పేర్కొంది.