హైదరాబాద్‌ వేదికగా దేశంలోనే మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ స్టోర్‌ను ప్రారంభించిన ‘‘విక్టర్‌’’..

"Victor" opened the country's first experience center store in Hyderabad.

-స్టోర్‌లో కస్టమర్‌లు ఉత్పత్తులను ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్ట్..

హైదరాబాద్: ప్రపంచంలోనే టాప్‌ -2 బ్యాడ్మింటన్ బ్రాండ్ ‘‘విక్టర్ రాకెట్స్’’ హైదరాబాద్‌లోని కొండాపూర్‌ వేదికగా భారతదేశపు మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభిస్తోంది. తైపీ తైవాన్‌లో 1968లో స్థాపించబడిన ఈ బ్రాండ్‌ నగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభింస్తున్నారు.

విక్టర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ స్టోర్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్ట్‌తో వినూత్నమైన షోరూమ్‌ను ప్రదర్శిస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను విక్టర్ బ్యాడ్మింటన్ స్టార్స్, ఒలంపియన్‌ క్రీడాకారులు అశ్విని పొన్నప్ప, హెచ్ఎస్ ప్రణయ్‌లతో పాటు స్వయంగా బ్యాడ్మింటన్ ఔత్సాహికురాలు ప్రముఖ భారతీయ సినీతార రెజీనా కసాండ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎ.పి. జితేందర్ రెడ్డి (మాజీ పార్లమెంటు సభ్యులు, న్యూఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రత్యేక ప్రతినిధి మరియు సలహాదారులు – క్రీడా వ్యవహారాలు), తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ (SATS) శ్రీ కె. శివ సేనా రెడ్డి పాల్గొన్నారు.

జర్మనీ, ఇండోనేషియా, జపాన్, థాయ్‌లాండ్, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శాఖలతో పాటుగా భారతీయ వినియోగదారులకు కూడా తైవాన్ ఆధారిత బ్యాడ్మింటన్ బ్రాండ్ ఉత్పత్తులైన దుస్తులు, గ్రిప్స్, కిట్ బ్యాగ్‌లు, రాకెట్లు, షూలు వంటి నాణ్యమైన బ్యాడ్మింటన్ పరికరాలను అందించడానికి భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందులో షటిల్ కాక్స్, స్ట్రింగ్స్ ఇతర బ్యాడ్మింటన్ సంబంధిత ఉత్పత్తులు ఉన్నాయి.

విక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 427 షోరూమ్‌లను కలిగి ఉండగా.., భారతదేశంలో మాత్రం ఇది మొట్ట మొదటి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ కావడం విశేషం. ఈ సందర్భంగా.., విక్టర్స్ భారత జనరల్ మేనేజర్ ‘బెన్ హ్సియుంగ్’ (Ben Hsiung ) మాట్లాడుతూ.., “భారతదేశంలో ఇదే మా మొదటి అధికారిక ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌. ఈ వేదికగా విక్టర్ కస్టమర్లు ఉత్పత్తులను ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. ఈ అనుభవం ఉత్తపత్తులపై వారికున్న నమ్మకాన్ని ధృఘపరుస్తుంది. కస్టమర్లు బ్యాడ్మింటన్‌ ఉత్పత్తులను కొనే ముందు స్వయంగా ఒకసారి పరిశీలించుకునే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తుంద’ తెలిపారు.

విక్టర్ బ్రాండ్‌ భారతీయ బ్యాడ్మింటన్ స్టార్స్, ఒలింపియన్స్ అయినటువంటి అశ్విని పొన్నప్ప, HS ప్రణయ్‌కి అధికారిక స్పాన్సర్‌గా కూడా వ్యవ్హరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అశ్విని మాట్లాడుతూ.., “విక్టర్ ద్వారా భారతదేశపు మొదటి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను చూడటం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఈ సెంటర్‌ సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు కస్టమర్లు నిర్ణయం తీసుకోవడంపై దృష్టి సారిస్తుంది. ఇక్కడ వినియోగదారులు తమకు సరిపోయే ఖచ్చితమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి రాకెట్‌లు, గ్రిప్‌లు, స్ట్రింగ్‌లు తదితర ఉత్పత్తులను ముందే ప్రయత్నించవచ్చ’’ని వివరించారు.

ప్రణయ్‌ కూడా తన అనుభవాలను పంచుకుంటూ.., “విక్టర్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఉండటం వల్ల కస్టమర్‌లు తమ గేమ్ స్టైల్, కంఫర్ట్, బాడీ ఎర్గోనామిక్స్ ఆధారంగా ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఒక అద్భుత వేదికను అందిస్తుంది. ఇది అనుభవమున్న లేదా నూతన క్రీడాకారులకు చాలా కీలకమైన అంశం. విక్టర్ ఆధ్వర్యంలోని లిమిటెడ్‌-ఎడిషన్ సిరీస్ ఇతర బ్రాండ్‌ల మాదిరిగా కాకుండా చాలా ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉండటం విశేష’’మని పేర్కొన్నారు. మాజీ ప్రో-బ్యాడ్మింటన్ ఆటగాడు, ప్రస్తుతం హైదరాబాద్ అంతటా A-జోన్ అకాడమీలను నడుపుతున్న అర్జున్ రెడ్డి ఈ విక్టర్‌ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రధాన అసోసియేట్. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్నటువంటి ఈ విక్టర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రతీ రోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 09:00 వరకు తెరిచి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?்?. Woosa?. Wohnungseinbruchdiebstahl : justizministerium will Überwachungsbefugnisse verlängern ⁄ dirk bachhausen.