మీకు చుండ్రు ఉందా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి!

hair dandruf

సీజన్ ఎప్పుడైనా సౌందర్య సంబంధిత చిన్న సమస్యలు అందరికీ ఎదురవుతాయి. వాటిలో చుండ్రు ముఖ్యమైనది. మార్కెట్లో లభించే హెన్నా పొడిని సహజ పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారు చేస్తే చుండ్రును తగ్గించడంలో మరియు జుట్టును మెరిపించడంలో సహాయపడతాయి. ఈ హెయిర్‌ప్యాక్‌ల తయారీ గురించి తెలుసుకుందాం.

1.చుండ్రు తగ్గించడానికి, 4 టేబుల్‌ స్పూన్ల హెన్నా పొడిలో 2 టేబుల్‌ స్పూన్లు నిమ్మరసం, పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. 30 నిమిషాలు ఉంచి, మృదువైన షాంపూతో కడుక్కోవాలి.

2.మందార ఆకులు, పువ్వులు, ఉసిరి, మెంతుల పొడి కలిపి పెరుగు తో మృదువైన పేస్ట్ తయారు చేసుకోండి. జుట్టుకు 30 నిమిషాలు ఉంచి, మృదువైన షాంపుతో కడుక్కోవడం చుండ్రు తగ్గిస్తుంది.

3.చుండ్రు తగ్గించడానికి నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, నిమ్మరసం, పెరుగు, ఆలివ్ నూనె, వెనిగర్, మెంతిపొడిని కలిపి రాత్రంతా ఉంచండి. ఉదయం జుట్టుకు అప్లై చేసి, 2-3 గంటల తర్వాత కడుక్కొనండి. మెంతులు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

4.మూడు టేబుల్‌ స్పూన్ల హెన్నా, ఒక టేబుల్‌ స్పూన్ ఆలివ్ నూనె, రెండు టేబుల్‌ స్పూన్ల బీట్ చేసిన గుడ్డుతో మిశ్రమం తయారు చేసి, 45 నిమిషాల పాటు ఉంచండి. గుడ్డులోని తెల్లసొన జుట్టుకు పోషణ ఇస్తుంది మరియు చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

హెన్నా వాడకం పూర్వకాలం నుంచే జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తోంది. చుండ్రును తగ్గించడం, సహజ రంగు అందించడం, కండిషనింగ్ చేయడం, మరియు పోషణ అందించడం ద్వారా ఇది జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?். Tw. Ihr dirk bachhausen.