‘ మట్కా ‘ నిర్మాతలకు , బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు కరుణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా.. నోరా ఫతేహి కీలక పాత్ర పోషించింది. టీజర్ , ట్రైలర్ ఆకట్టుకోవడం తో సినిమా కూడా బాగుంటుందని మెగా ఫ్యాన్స్ భావించారు . కానీ సినిమా కు ట్రైలర్ కు సంబంధం లేకుండా అయిపోయింది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ కూడా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఫస్ట్ డే ఫస్ట్ ఆటతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ టాక్ ప్రభావం సినిమా వసూళ్లపై భారీగా పడింది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో రూ.1.10 కోట్ల మాత్రమే కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలకు ముందు రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో రూ.19 కోట్లు రావాలని పేర్కొన్నాయి. కానీ అవి వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పటికే చాల థియేటర్స్ లలో ఈ సినిమాను లేపేసి అమరన్ , క సినిమాను వేస్తున్నారు. వ‌రుస డిజాస్ట‌ర్లతో ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గ్యాంగ్‌ స్టర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన ఫలితం దక్కలేదు. మట్కా మూవీ కథ విషయాని వస్తే.. 1950-1980 మధ్య కాలంలో మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే విషయాల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.

ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్.. ‘వాసు’ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. వాసు తన చిన్నతనంలో బర్మా నుంచి శరణార్తిగా వైజాగ్ చేరుకుంటారు. పేదరికంతో బాధపడుతున్న వాసు.. తన అవసరాల కోసం.. చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. అయితే.. ఒకసారి చేయని తప్పుకు జైలులో శిక్ష అనుభవిస్తాడు. జైలులో ఎదురైన అనుభవాలతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో వాసు మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ ను ప్రారంభిస్తాడు. అనతికాలంలోనే బిజినెస్ లో వాసు కోట్లు సంపాదిస్తాడు. ఆ బిజినెస్ కు కింగ్ గా మారుతాడు. కటిక పేదరికంలో పుట్టిన వాసు.. చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు.. ఒక్కసారిగా మట్కా కింగ్ గా ఎలా ఎదుగుతాడు. అతని ప్రయాణంలో ఎదురైన సవాళ్లు లేంటీ? ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది? మట్కా కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?ை. 葉下午茶?. Suche dirk bachhausen.