తెలంగాణ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాల నిరసనలు ఫలవంతమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన సెలవుల జీవో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, ఈ ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు ఆందోళనలు ప్రారంభించారు. ఇంతకుముందు బెటాలియన్ కానిస్టేబుళ్లకు 15 రోజులకు ఒకసారి సెలవుపై ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది. కానీ, కొత్త జీవో ప్రకారం 26 రోజులకు ఒకసారి మాత్రమే సెలవు మంజూరు చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.
ఈ జీవోపై బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసన చేపట్టి, పలు బెటాలియన్ల ముందు ధర్నాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ స్పెషల్ అదనపు డీజీపీ తాజా ఉత్తర్వులను జారీ చేయడంతో ప్రభుత్వం తాత్కాలికంగా జీవోను నిలిపివేసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయంతో దిగొచ్చి, తాత్కాలికంగా కుటుంబాలకు ఊరట కల్పించడంతో కానిస్టేబుళ్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.