ప్రాంతీయ వ్యాపారాలలో శ్రేష్ఠతను వేడుక జరుపుకోవడానికి ఎంటర్‌ప్రైజ్ గ్రోత్ అవార్డ్స్ 2024 కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోన్న డెలాయిట్ ఇండియా

deloitte india

న్యూఢిల్లీ : ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ భారతదేశంలోని అసాధారణమైన కుటుంబ యాజమాన్య వ్యాపారాలు, యునికార్న్‌లు మరియు సూనికార్న్‌లు అందిస్తున్న తోడ్పాటును గుర్తించే లక్ష్యంతో డెలాయిట్ ఇండియా ఇప్పుడు ఎంటర్‌ప్రైజ్ గ్రోత్ అవార్డ్స్ 2024 (ఈజిఎ 2024) యొక్క మొదటి ఎడిషన్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతీయ అవార్డులు కోసం ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, అత్యుత్తమ నాయకత్వం, ముందుచూపు మరియు వృద్ధిని ప్రదర్శించే మరియు తమ స్థానిక కమ్యూనిటీల అభివృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందించే కంపెనీలను ఈ అవార్డులు గుర్తించనున్నాయి.

ఈ అవార్డుల ప్రక్రియ ఆర్థిక పనితీరు, ఆవిష్కరణ మరియు సామాజిక ప్రభావం వంటి కీలక ప్రమాణాల ఆధారంగా కంపెనీలను జాగ్రత్తగా మూల్యాంకనం చేస్తుంది. కుటుంబ వ్యాపారాలు ఈ అవార్డుల కోసం పాల్గొనడానికి కావాల్సిన అర్హతలలో , గణనీయ ప్రమోటర్ యాజమాన్యంతో (26 శాతానికి పైగా) రూ. 1,000 కోట్ల నుండి రూ. 5,000 కోట్ల మధ్య విక్రయాల టర్నోవర్‌ను కలిగి ఉండటం ప్రధానమైనది. యుఎస్ $500 మిలియన్ మరియు యుఎస్ $1 బిలియన్ మధ్య విలువ కలిగిన స్టార్టప్‌లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడుతున్నారు. ప్రతి కంపెనీ యొక్క వృద్ధి ప్రయాణం మరియు కమ్యూనిటీలకు వారు అందించిన సహకారాన్ని అంచనా వేయడానికి ఈ అవార్డులు గత మూడు సంవత్సరాల ఆర్థిక రికార్డులను కూడా సమీక్షిస్తాయి.

“కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు, అభివృద్ధి చెందుతున్న వృద్ధి సంస్థలు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి యునికార్న్స్ మరియు సూనికార్న్లు మన ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి, అయినప్పటికీ అవి పొందాల్సిన గుర్తింపును పొందడం లేదు. ఈ కంపెనీలు ప్రాంతీయ అభివృద్ధి మరియు జాతీయ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తాయి, ఉద్యోగ కల్పన, ఆవిష్కరణ మరియు ఆర్థిక వృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నాయి. ఈజిఏ ను ప్రారంభించడం ద్వారా, పరిశ్రమలో తరచుగా పట్టించుకోని ఈ ఛాంపియన్‌లను గుర్తించడం, వారికి తగిన గుర్తింపును అందించడం మా లక్ష్యం. వారి విజయాలను వేడుక చేయటం ద్వారా, భారతదేశం అంతటా అధిక-వృద్ధి చెందుతున్న కంపెనీల డైనమిక్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి మేము ప్రయత్నిస్తున్నాము, నిరంతర అభివృద్ధిని నడపడానికి మరియు భారతదేశం యొక్క దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి భాగస్వామ్యం మరియు విజ్ఞాన-మార్పిడిని ప్రోత్సహిస్తున్నాము. అర్హత కలిగిన కంపెనీలన్నీ పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తున్నాము” అని డెలాయిట్ ప్రైవేట్, డెలాయిట్ ఇండియా భాగస్వామి మరియు లీడర్ కె ఆర్ శేఖర్ అన్నారు.

“ఈజిఎ ద్వారా, మేము వ్యాపార విజయాలను వెల్లడించటం కంటే ఎక్కువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము ఈ కంపెనీల అంకితభావం, స్థిరత్వం మరియు దీర్ఘకాలిక నిబద్ధతను గుర్తించాలనుకుంటున్నాము. కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు, యునికార్న్‌లు మరియు సూనికార్న్‌లు అభివృద్ధి చెందుతున్న కొద్ది ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటాయి మరియు తమ కమ్యూనిటీలకు అర్థవంతంగా సహకరిస్తున్నప్పుడు వీటిని అధిగమించగల సామర్థ్యం వారి విలువలు మరియు లక్ష్యాలను గురించి గొప్పగా తెలియజేస్తుంది. వారి పనితీరుతో పాటు వారి పట్టుదలను గుర్తించడం కోసమే ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఈ అవార్డులు కంపెనీలు తమ ప్రయాణాలను పంచుకోవడానికి, ఇతరులకు స్ఫూర్తినివ్వడానికి మరియు అంతిమంగా సుస్థిరమైన మరియు సమ్మిళిత ఆర్థిక పురోగతి యొక్క విస్తృత లక్ష్యానికి దోహదపడతాయని నేను ఆశిస్తున్నాను” అని డెలాయిట్ ఇండియా భాగస్వామి ధీరజ్ భండారీ అన్నారు.

ఈ అవార్డులలో భాగంగా నిర్వహించే ప్రాంతీయ అవార్డ్స్ నైట్ కార్యక్రమాలలో వ్యాపార సంస్థలను తమ పరిశ్రమ సహచరులతో నెట్‌వర్క్ చేయడానికి మరియు పరిశ్రమలోని ప్రముఖులతో సంభాషించటానికి అనుమతిస్తాయి. ఎంటర్‌ప్రైజ్ గ్రోత్ అవార్డ్స్ విజేతలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్క్యూ అవార్డుల ప్రోగ్రామ్‌, డెలాయిట్ యొక్క బెస్ట్ మేనేజ్‌డ్ కంపెనీస్ ప్రోగ్రామ్లో కూడా పాల్గొనగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. ?推薦. Am stadtrand von potsdam veröffentlichte, hörten viele den namen silke schröder zum ersten mal.