గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న నయనతార Rakkayie టీజర్

నయనతార బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా ఆమె కొత్త సినిమా టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘రక్కాయీ’ టైటిల్ తో సెంథిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ లో నయనతారని బిడ్డ తల్లిగా చూపించారు. ఆమె ఒక గుడిసెలో ఉంటుంది. అక్కడికి ఆమెని చంపడానికి రౌడీ మూకలు వస్తారు. గుడిసెలో బిడ్డ ఊయల్లో ఏడుస్తూ ఉంటుంది. మిరపకాయలు రోకలిలో దంచుతుంది. తరువాత బిడ్డకి పాలు పట్టి ఒక కొడవలిని వెదురు కర్రకి కట్టి బయటకొచ్చి ఎదురుగా నిలబడుతుంది. తనపై దాడి చేయడానికి వచ్చేవారిపై ఎదురుదాడి చేసి ఊచకోత కొస్తుంది.

గోవింద్ వసంత పవర్ ఫుల్ ఎలివేషన్ మ్యూజిక్ తో అదిరిపోయే విజువల్స్ తో ఈ టీజర్ ఉంది. టీజర్ లో నయనతార లుక్స్ కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే పీరియాడికల్ యాక్షన్ మూవీ అని అర్ధమవుతోంది. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డ్రమ్‌ స్టిక్స్ ప్రొడక్షన్స్‌, మూవీ వెర్సె ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోవింద్‌ వసంత సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్‌, ఇతర వివరాలపై క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటె నయనతార పై తెరకెక్కిన డాక్యుమెంటరీ(Documentry) సైతం ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ మొదలుపెటింది. అయితే ఈ డాక్యుమెంటరీ గొప్పగా ఏమీ లేదని అన్నారు. గంటన్నర నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ చప్పగా సాగిందని. అసలు నయనతార జీవితంలో కథకు కావాల్సినంత మెటిరీయల్‌ ఏముంది ..? ఉన్నా ఇందులో చూపించలేదు ఎందుకు అని ప్రశింసింతున్నారు. వ్యక్తిగత జీవితంలో ఆమెకు కొన్ని ఆటుపోట్లు వచ్చి ఉంటాయి. కొన్ని ప్రేమలు దెబ్బతిని ఉంటాయి. కెరీర్‌లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యి ఉంటాయి. అయినప్పటికీ అవేమీ పెద్దవి కావు. చాలా మంది హీరోయిన్లకు ఎదురయ్యే ఇబ్బందులే ఇవి అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

NAYANTHARA’S ACTION-DRAMA ‘RAKKAYIE’ TITLE TEASER UNVEILS ON HER BIRTHDAY… On the occasion of #Nayanthara‘s birthday, #DrumsticksProductions and #MovieVerseStudios unveil the title teaser of period-action drama #Rakkayie, a PAN-India film.

🔗: https://t.co/MvdxrBGgVD

Directed… pic.twitter.com/eguMy9aL73— taran adarsh (@taran_adarsh) November 18, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?ை?. 艦概念?. Was wünschst du dir von einer digitalen zivilgesellschaft für die zukunft ? und was kann jede*r einzelne dazu beitragen ?.