కంగనా ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

వివాదాల్లో చిక్కుకున్న నటి కంగన చిత్రం ‘ఎమర్జెన్సీ’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. జనవరి 17 , 2025 న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. కంగనా ఈ సినిమాలో లీడ్ రోల్​ చేయడంతో పాటు.. దర్శకత్వం వహించి, నిర్మించింది. ఈ బయోగ్రాఫికల్ పొలిటికల్ థ్రిల్లర్ ద్వారా 21 నెలల ఎమర్జెన్సీ పాలన కాలంలో ఇందిరా గాంధీ జీవితాన్ని తెరపై చూపించబోతున్నారు. ఇది 1975 నుంచి 1977 మధ్యకాలంలో సాగే కథతో తెరకెక్కింది.

భారతదేశ చరిత్రలోనే వివాదాస్పద, గందరగోళ అధ్యాయంగా ఉన్న ఎమర్జెన్సీ కాలాన్ని తెరపైకి తీసుకురావడం అన్నది నిజంగా కంగనా రనౌత్ చేసిన సాహసం అనే చెప్పాలి. ఈ మూవీ ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచే పలు అడ్డంకులను ఎదుర్కొంటుంది. సినిమాలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న కారణంగా పలువురు రాజకీయ నాయకులు ఈ మూవీపై తీవ్ర విమర్శలు చేశారు. పైగా మూవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ వినిపించింది. ఈ వివాదం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఆగేదాకా వెళ్ళింది. అలాగే సెన్సార్ సర్టిఫికేషన్ కూడా ఆలస్యం కావడంతో కంగనా కోర్టుకెక్కింది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను సినిమాలో ప్రముఖంగా చూపించనున్నారు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుంచే చిత్రంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఓ వర్గం సెన్సార్‌ బోర్డుకు లేఖ కూడా రాసింది. దీంతో, సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది.

సెన్సార్‌ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయని, తమ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదంటూ కంగన అసహనం వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ విషయంలో ఓ నిర్ణయానికి రావాలంటూ బాంబే హైకోర్టు కూడా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్​ అక్టోబర్ 17న వచ్చింది. తమ సినిమాకు సెన్సార్​ పనులు పూర్తైనట్లు కంగన కూడా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో ఈ చిత్రం సెప్టెంబర్ 6న వచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత కూడా పలు కోర్టు కేసులను కూడా ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే, ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 17న ‘ఎమర్జెన్సీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంగనా రనౌత్‌ స్వయంగా ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ‘భారత దేశంలో శక్తిమంతమైన మహిళ చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు వచ్చే ఏడాది జనవరి 17న మీ ముందుకు రాబోతున్నాయి’ అంటూ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

்?. 樓餐廳?. Wohnungseinbruchdiebstahl : justizministerium will Überwachungsbefugnisse verlängern ⁄ dirk bachhausen.