వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ‌పై కేసు న‌మోదు

వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు అవ్వడం , పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజాగా వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్కలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ వెంట‌నే దువ్వాడ‌ను విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీస్ లు పంపారు. దివ్వెల మాధురితో సాన్నిహిత్యం కారణంగా గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు తరచుగా మీడియాకెక్కుతోంది. తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.

శ్రీనివాస్ విషయానికి వస్తే.. మొదటగా దువ్వాడ శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా, 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశాడు. దువ్వాడ శ్రీనివాస్‌ 2009లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలై, 36552 ఓట్లతో మూడవస్థానంలో నిలిచాడు. దువ్వాడ శ్రీనివాస్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో టెక్కలి నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేసి 8387 ఓట్ల తేడాతో, 2019లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి 6,653 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

దువ్వాడ శ్రీనివాస్ ను వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2021 ఫిబ్రవరి 25న ఖరారు చేశాడు. ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 2021 మార్చి 8న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపాడు. ఆయన శాసనసభ్యుడిగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తో రాజకీయాలపై కంటే మాధురి పై ఎక్కువ ఫోకస్ పెట్టి మరింత గా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

系?. Login to ink ai cloud based dashboard. New 2025 heartland cyclone 4006 for sale in arlington wa 98223 at arlington wa cy177 open road rv.