రెండు స్టేజీలలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

We will complete the Visakha Metro Rail project in two stages: Minister Narayana

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ మాట్లాడుతూ..మెట్రో పాలసీ ప్రకారం మెట్రో రైల్ కార్పొరేషన్ కు అప్లై చేసారని… మెట్రో రైల్ టెండర్లు గత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల విశాఖ మెట్రో రైలు ఆగిపోయిందని వెల్లడించారు. 76.9 కిలోమీటర్ల 4 కారిడార్ కోసం మూడేళ్ళ తరువాత గత ప్రభుత్వం డిపిఆర్ ఇచ్చిందన్నారు. కక్ష సాధింపు ధోరణితో గత ప్రభుత్వం కాలయాపన చేసిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహించారు.

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. మెట్రోరైల్ రాకుండా గ‌త ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా ప‌క్క‌న పెట్టేసింద‌ని మంత్రి విమ‌ర్శించారు. మెట్రో ప్రాజెక్టుపై స్వ‌యంగా కేంద్ర‌మంత్రిని క‌లిసిన‌ట్లు మంత్రి నారాయ‌ణ వెల్ల‌డించారు.

రెండు స్టేజీలలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రానికి రాసామని తెలిపారు. 11,491 కోట్లతో ఈ ప్రాజెక్టు చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. ఎండాడ, మద్దిలపాలెం, హనుమంతవాక, స్టీల్ ప్లాంట్ ల వద్ద క్రాసింగ్ ల నిర్మాణం అన్నారు మంత్రి పొంగూరు నారాయణ. ఇక అటు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పై మండలిసభలో చర్చించాలని వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

单田芳?. Because the millionaire copy bot a. Travel with confidence in the kz durango gold.