ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి సిద్ధమవుతూ, “రీడెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్” పేరుతో డిజైన్లకు టెండర్లను ఆహ్వానించింది. కొత్త భవన్ నిర్మాణాన్ని మొత్తం 11.53 ఎకరాల్లో చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ఏపీ భవన్‌ను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఉపయోగించుకుంటున్నాయి.
ఇప్పుడు, సొంత కార్యాలయ వసతులు ఏర్పాటుచేసుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనపై చర్చలు జరిపి, ప్రతిపాదనలు కేంద్ర హోం శాఖకు పంపగా, ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఎన్నికల ముందు ఈ కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభం కానుండటం, అందులో ఆధునిక సదుపాయాలను అందించాలన్న ఉద్దేశంతో, ఏపీ భవన్‌కు విస్తృతమైన రూపకల్పన చేయనున్నారు.