సికెల్‌ సెల్‌ అవగాహన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన సికెల్‌ సెల్‌ సొసైటీ

Sickle Cell Society organized special programs on the occasion of Sickle Cell Awareness Day

హైదరాబాద్‌ : అక్టోబర్‌ నాల్గవ శనివారాన్ని ప్రతి సంవత్సరం సికెల్‌ సెల్‌ అవగాహన దినంగా జరుపుతుంటారు. దానిలో భాగంగా నేడు (అక్టోబర్‌ 26)న తలసేమియా అండ్‌ సికెల్‌ సెల్‌ సొసైటీ (టిఎస్‌సిఎస్‌), శివరాం పల్లి లోని తమ ప్రాంగణంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలతో పాటుగా వైద్య శిబిరం కూడా నిర్వహించింది. ‘సికెల్‌సెల్‌ వ్యాధి బారిన పడిన వారిలో సైకలాజికల్‌, సామజిక సమస్యలు, వాటితో పోరాడటం’ గురించి ప్రత్యేకంగా డాక్టర్.అజ్రా ఫాతిమా (క్లినికల్ సైకాలజిస్ట్)చే మాట్లాడారు. దాదాపు 150 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగీకారం, శ్వాస వ్యాయామాలు, పరధ్యానం మరియు సానుకూల ఆలోచనలు వంటి అంశాలను డా.అజ్రా చర్చించారు. శ్రీ చంద్రకాంత్ అగర్వాల్, డాక్టర్ సుమన్ జైన్, శ్రీమతి అనితా ఉపాధ్యాయ మరియు శ్రీమతి ప్రియదర్శిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం తో పాటుగా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఒపి , వ్యాక్సినేషన్ మరియు రోగులకు మందులు జారీ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??江苏老?. 7 figure sales machine built us million dollar businesses. 2025 forest river rockwood mini lite 2515s.