‘గజినీ 2 ‘ సెట్స్ పైకి రాబోతోందా..?

సూర్య -మురుగదాస్ కలయికలో 2005 లో వచ్చిన గజని మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. ఈ మూవీ తో సూర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాలోని సూర్య యాక్టింగ్ గురించి ఇప్పటికి చెపుతుంటారు. అలాగే మ్యూజిక్ కూడా..ఇప్పటికి వినిపిస్తుంటాయి. కేవలం తెలుగు లోనే కాదు హిందీ లోను సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం హిట్ సినిమాలన్నీ సీక్వెల్ చేస్తున్న క్రమంలో కాజ్ఞయి కూడా సీక్వెల్ రాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 19 ఏళ్ల తర్వాత మురుగదాస్ – సూర్య కాంబోలో ‘గజిని-2’ రాబోతున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో దీనిపై ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఏ ఆర్ మురుగదాస్ నే చేసిన ఈ చిత్రంకి సీక్వెల్ పై కొన్నాళ్ల కితం పలు రూమర్స్ వచ్చాయి. అలాగే ఈ రూమర్స్ ఇపుడు నిజం అయ్యేలా ఉన్నాయని చెప్పాలి. మురుగదాస్ తమిళ్ సహా హిందీలో గజినీ 2 తియ్యనున్నారని టాక్ వైరల్ గా మారింది. అలాగే సూర్య కూడా హింది గజినీ పార్ట్ 2లో అమీర్ తో కనిపిస్తాను అని కంగువా హిందీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపినట్టుగా ఓ స్టేట్మెంట్ కూడా వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *