ఏపీలో మందుబాబులకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. మద్యం పై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసారు.డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ కింద దీన్ని వసూలు చేస్తుండగా, రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.
తాజా నిర్ణయం ప్రకారం.. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే ఒకవేళ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 ఉంటే.. దానిని రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది. విదేశీ మద్యం బాటిళ్లపై అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచారు.