ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ

Liquor-shops-lottery-today-in-AP

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది.

అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు లాటరీ పధ్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న (రేపు) ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. దీంతో 16వ తేదీ నుండి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

登录. Follow the instructions, generate your sales machine funnel in 1 click…. The 2025 thor motor coach inception 34xg stands out with its sophisticated and functional design.