Fairfax Agreement : ఐడిబిఐ బ్యాంకు నియంత్రణాధికా రాన్ని కెనడాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హెరాల్డింగ్స్కు బదిలీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశ ఆర్ధిక సార్వభౌమత్వా నికి, బ్యాంకుల యాజమాన్యఉనికికి, భారత బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్య త్తుకు సంబంధించిన అత్యంత కీలక మైన ప్రశ్నలకు కేంద్రబిందువు అయింది. దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఆర్ధిక సహకారం అందించాలనే ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన ఐడిబిఐ దేశ ఉత్పాదకత సామ ర్థ్యాన్ని పెంపొందించటంలో విశేషపాత్ర పోషించింది. ప్రజా ధనం, ఉద్యోగుల శ్రమ, ఖాతాదారుల నమ్మకమనే పునాది ప్రాతిపదికన నిర్మితమైన ఈ బ్యాంకింగ్ సౌధాన్ని విక్రయిం చదగిన వాణిజ్య ఆస్తిగా పరిగణించడం సమంజనం కాదు. ‘ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ) 1964 జూలై 1న, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఏర్పడి దేశ పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి. పరిశ్రమల ఆధునీకరణ, ఉత్పాదక సంస్థల విస్తరణ, వెనుకబడిన ప్రాంతాలలో పారి శ్రామిక కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తూ దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచి, 2004లో బ్యాంకింగ్ సంస్థగా రూపాంతరం చెందింది. బ్రాంచి నెట్వర్క్ లాభదా యకత, డివిడెండ్ పేమెంట్, నైపుణ్యంగల ఉద్యోగులు, రుణాలు పొందిన లబ్దిదారులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి, పారిశ్రామిక యూనిట్ల విస్తరణ, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల నిధులు, ఖాతాదారులకు విలువైన సేవలు వంటి అనేక అంశాలతో దశాబ్దాలుగా ఐడిబిఐ ప్రస్థానం నిరుపమానం. కేవలం లాభాల ప్రాతి పదికన పనిచేసే సంస్థగా కాకుండా, ఉపాధి కల్పన, దేశీయ పొదుపు సమీకరణలో ముఖ్యపాత్ర, సమ్మిళితాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి వంటి ఉన్నత లక్ష్యాలతో ముడిపడిన ఆర్థిక చోదక శక్తిగా ఐడిబిఐని అభివర్ణించవచ్చు.
Read Also : TRAI New Rules: టెలికాం రంగంలో కీలక మార్పులు.. ట్రాయ్ కొత్త మార్గదర్శకాలు ఇవే

Fairfax Agreement : ఆశించిన బిడ్లు రాకపోవడం
సామాజిక భద్రతా కార్యక్రమాలకు తోడ్పడటం, కుటుంబాలకు, సూక్ష్మ వ్యాపార సంస్థలకు, చిన్న రుణ గ్రహీతలకు రుణాలను అందించటం, మూలధన మార్కెట్ల పురోగతిలో, బ్యాంకింగ్ సేవల విస్తరణలో పారిశ్రామిక ప్రాజెక్ట్ల పురోభివృద్ధిలో, వ్యాపార సంస్థల విస్తరణలో, ప్రజల పొదుపు సమీకరణలో బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోనికి తేవ టంలో సుదీర్ఘకాలంగా విస్తృత బాధ్యతలను నిర్వహించిన ఐడిబిఐ బ్యాంకును విదేశీ యాజమాన్యానికి అప్పగించటం వలన దేశ ప్రజలకు కలిగే అదనపు ప్రయోజనం ఏమిటనేది మౌలిక ప్రశ్న. దశాబ్దాల పయనంలో ఐడిబిడిలో ఏర్పడిన ఒడిదుడుకులు, ఆర్ధిక ఇబ్బందులు, మూలధన అవసరాల నేపథ్యంలో, 2019లో ఎఐసి ఆఫ్ ఇండియా ఐడిబిఐ బ్యాంకులో నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. అనం తరం రిజర్వు బ్యాంకు వర్గీకరణ, నియంత్రణా నిబంధనల ప్రకారం ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటురంగ బ్యాంకుగా పరి గణించింది. ఫెయిర్ఫాక్స్ యాజమాన్య బదిలీ ప్రతిపాదన ముందు భారత ప్రభుత్వం 45.48, ఎలసి 49.24 వాటాలను కలిగి ఉంది. అంటే ఈ రెండిటి వాటా94.72. ప్రభుత్వరంగ బీమాసంస్థ ఎల్ ఐసి ఐడిబిఐలో ప్రధాన వాటాదారుగా మారి బ్యాంకు స్థిరీకరణ తోడ్పడటం కీల కాంశం. ఐడిబిఐ బ్యాంకు వాటాల ఉపసంహరణ ప్రక్రియ 2002లో ప్రారంభ మైనప్పటికీ, ప్రక్రియలో జాప్యం, లావా దేవీలు ముందుకు సాగకపోవడం, వాటా విలువ నిర్ధారణపై భిన్నాభిప్రాయాలు, ఆశించిన బిడ్లు రాకపోవడం వంటి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం ప్రభు త్వం ఒక్కో షేరుకు రూ.94.42 గా నిర్ణయించినప్పటికీ, ప్రారంభ రిజర్వు ధరకు తగిన బిడ్లు రాకపోవడంతో తిరిగి సవరించిన ప్రతిపాదనలతో బిడ్లను ఆహ్వానించింది.

ప్రభుత్వ విధానాలు పరాయీకరణ దిశగా
అనం తరం ఆర్ధిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ పేరు రూ.81 చొప్పున, మొత్తం 60.72 శాతం మేర వాటాకు, సుమారు 52,878 కోట్ల విలువైన ఫెయిర్ఫాక్స్ ప్రతిపాదనకు ఆమో దం తెలిపింది. స్వతంత్ర విలువ నిర్ధారణ ప్రమాణం ప్రకా రం ఒక్కో పేరు విలువ రూ.75.99 అని, ఈ ప్రమాణం కంటే ఎక్కువ ధర లభించిన కారణంతోనే ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హెల్డింగ్కు ఐడిబిఐ నియంత్రణాధికారాన్ని బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొనటం సర్వత్రా చర్చ నీయాంశమయింది. విలువ నిర్ధారణలో ఉపయోగించిన అంచనాలు, ఆస్తుల విలువ మూల్యాంకన పద్ధతులు, భవి ష్యత్ ఆదాయ అంచనా, పనితీరు సామర్థ్యం, విదేశీ సంస్థకు బదలీ చేయకుండా ప్రభుత్వ యాజమాన్యాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాలపై పారదర్శకంగా చర్చ జరగకపోవడం తీవ్ర విమర్శకు గురియైనది. ఐడిబిఐ బ్యాంకును విక్రయించక తప్పదనే వాదన గతంలో అది ఎదుర్కొన్న ఆర్ధిక సంక్షోభాన్ని ఆధారంగా చేసుకుని కొనసాగిస్తున్న పోకడ మాత్రమే. 2017లో రిజర్వు బ్యాంకు అధిక నిరర్థక ఆస్తులు, నష్టాల కారణంగా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పరిధిలోకి తీసుకువచ్చి నప్పటికీ, అనంతరం మెరుగుపడిన ఆర్ధిక పరిస్థితులదృష్ట్యా 2021లో ఆపరిమితులను తొలగించింది. 2018లో 3178 గా ఉన్న స్థూలనిరర్థక ఆస్తుల నిష్పత్తి. 2026 మార్చినాటికి 2.32 శాతానికి, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 0.15 శాతా నికి తగ్గింది. మూలధన సంవృద్ధి నిష్పత్తి 26.65 శాతానికి చేరి, గణనీయమైన పనితీరును ప్రదర్శించింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఐడిబిఐ సుమారు రూ.9,513 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణ, ప్రైవేటీకరణ స్థాయిని దాటిపోయి ప్రభుత్వ విధానాలు పరాయీకరణ దిశగా పయనించే పరిస్థితికి చేరాయనేదానికి ఈ ప్రక్రియ ఒక ఉదాహరణ. సుమారు 2000 శాఖలతో విస్తరించిన ఐడిబిఐలో ప్రభుత్వ మెజారిటీ వాటాను కొనసాగించడం, పారదర్శకంగా విలువ నిర్ధారణ చేయడం, ఉద్యోగుల, డిపాజిటర్ల హక్కులకు చట్టబద్ధత కలిగించడం, ఉత్పాదక రంగాలకు రుణాల మంజూరును పరిరక్షించడం, పార్లమెంటరీ కమిటీని నియమించడంవంటి చర్యలు తక్షణ ఆవశ్యకం అనేది ప్రజాభిప్రాయం.
-జి. కిషోర్ కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: