Delimitation : దేశం అవిచ్ఛిన్నంగానే అడుగేస్తుంది!

Follow Us: Google News Daily Hunt
Delimitation
Delimitation
FONT SIZE
GET APP

Delimitation : ప్రజాస్వామ్యంలో చర్చలు, డిబేట్లు నిరంతరం కొన్ని జటిలమైన సమస్యలు పరిష్కారం కాకుండా వున్నప్పుడు పాలకులు ప్రతిపక్షాలతో, ప్రముఖులతో, మేధా వులతో, అన్ని రంగాల నిపుణులతో విస్తారంగా కొనసాగిస్తూనే వుండాలి! అరమరికలు లేకుండా, ఒకరినిమించి మరొకరు పాయింట్స్ స్కోరు చేయ టానికి కాకుండా పారదర్శకంగా, మీడియా సాక్షి గా ఛానెళ్ళలో ప్రసా రమయ్యే రీతిలో సామాన్యులకు గూడా దేశాన్ని పాలించే వారితో పాటు, రాజకీయ నాయకులు అందరూ పాల్గొని ఒక సమస్య మీద డిబేట్ చేయగలుగుతే, సాధ్యమైనరీతిలో అందరి ఆమోదం సాధించలేకపోయినా మెజార్టీ అభిప్రా యాన్ని పొందగలుగుతే, ఆ సమస్య పరిష్కారం సులువుగా మారుతుంది! సోషల్ మీడియా వల్ల అనేక ప్రయోజనాలు వున్న మాట వాస్తవం. సమాచారం సులువుగా అందరికీ అందుబాటులో వుండటానికి సోషల్ మీడియా దోహదం చేస్తున్నది. అయితే ఈ వ్యవస్థ రాజకీయ నాయకులే ననకాకుండా ఇతర స్వప్రయోజనపరుల చేతుల్లోకి పోకుండా, సమాచారాన్ని యధారీతిలో మీడియాతో పాటు చేరవేయ గలుగుతే అంతకంటే కావల్సిందేమున్నది! బేదాభిప్రాయాలతో పాటు, సమస్య మూలాలు, పరిష్కారానికి ఇబ్బందులు తెలుసుకోగలగటంతో ఎవరో నవ్వుతూ చెప్పినట్లు బాల్ అందరి కోర్టులో పడ్డట్లు అవుతుంది. సామాన్యుడు గూడా ఆ చిక్కు సమస్యను ‘ఓన్’ చేసుకొని పరిష్కార దిశగా అడుగులు వేసే ప్రయత్నం కల్పించబడుతుంది! కొంచెం ఆలస్య మైనా ప్రతి సమస్య పూర్వాపరాలు తెలియటం వల్ల ఏది మంచో ఏది చెడో ఎకు 2వ మంది ప్రజలకు అంతుపట్టే అవ కాశం లభ్యపడుతుంది! ఈ ప్రక్రియ నిజానికి ప్రజాస్వామ్య పునాదులను మరింతగా బలపరుస్తుంది!

Read Also : SC on Delhi Firecracker : దీపావళి వేళ బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Delimitation
Delimitation

Delimitation : ప్రతిపాదనలు డీలి మిటేషన్ సమస్య మీద

ప్రతిపక్షం అందరం అన్ని పార్టీలు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ డీలిమిటేషన్ సమస్యను కూలంకషంగా చర్చించి ఒక నిర్ణ యం సమిష్టిగా తీసుకుందాం అని ప్రభుత్వాన్ని, ఖర్గే కాంగ్రెసు అధ్యక్షుడు కోరుకోవటంలో తప్పుపట్టాల్సిన పని లేదు! దాదాపు నాలుగైదు సార్లు లేఖల ద్వారా ఈ కోరికను పాలకులకు అందజేసాడు కానీ ప్రధాని పెద్దగా ప్రతి స్పం దించలేదు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాత్రం, అనేకసార్లు ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ సహకారం ఈ సమస్య విషయంలో కోరటం జరిగింది. అదే విధంగా ఇతర ప్రతిపక్షాలను గూడా కోరాం! అంతవరకే ఆయన సమాధానం ఇచ్చారు కానీ ఖచ్చితమైన ప్రతిపాదనలు, డీలి మిటేషన్ సమస్య మీద వున్నాయి మా ప్రభుత్వం దగ్గర అన్న రీతిలో జవాబు ఇవ్వక పోవటంతో అఖిలపక్ష సమా వేశం జరగనే జరగలేదు. అయితే రిజిజు రాసిన లేఖలో డీలిమిటేషన్ విషయంలో చట్టం తెస్తాం అని మాత్రమే రాసారు కానీ ఇతర వివరాలు ప్రజల్లో డిబేట్ కోసం ఏ మాత్రం బహిర్గత వర్చలేదు! అదీ వాస్తవంగా డీలిమిటేషన్” పైన వున్న ప్రస్తుత పరిస్థితి! డీలిమిటేషన్ విషయాన్ని, మహిళా రిజర్వేషన్ సమస్యతో ముడిపెట్టటంతో పరిస్థితి పరిష్కారం విషయంలో జటిలమైంది! ఈ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగళి మాదిరే వుంది! డీలిమిటేషన్ చట్టంతో ఆ విషయాన్ని జత కల్పటంతో, పాలకులు ఏ దిశగా ఆలోచిస్తున్నారో మేధావులకూ రాజ కీయ విశ్లేషకులకూ అవగతమైంది!

డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరిగే ..

నిజానికి మహిళా రిజర్వే షన్ల విషయంలో, లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో 1/3వంతు సీట్లు మహిళల కోసం రిజర్వ్ చేయాలనే విషయం తదువరి డీలిమిటేషన్లో జరుగుతుంది అన్నది నిర్ణయం తీసుకున్న విషయంగా వున్నప్పుడు అదీ డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరిగే విషయంలో ముడిపెట్టి పేచీ పెట్టాల్సిన సమస్య కానేకాదు! నిజమైన సమస్యల్లా లోకసభలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఏవిధంగా రాష్ట్రాల మధ్య అవి పంచబడ్డాయన్నదిమాత్రమే! కేంద్ర ప్రభుత్వం లోక్సభ సీట్లు 850కి పెంచబడినప్పుడు, మహిళలకు పెంచిన సీట్లు రిజర్వ్ చేయటం జరుగుతుం దని, రాష్ట్రాలలో వున్న శాతాన్ని తగ్గనీయకుండా వుంచే ఏర్పాటు వుంటుందని చెబుతున్నది! వీలుంటే 50 శాతం రిజర్వేషన్లు పెంచవచ్చు అన్న సంకేతం గూడా స్పష్టత లేకుండా ఇస్తుండటం గమనార్హం! తర్వాత కేంద్ర ప్రభుత్వం 2011 సెన్సెన్ను అనుసరించి లోక్సభ సీట్లు పంచాలన్న బిల్లును ప్రవేశపెట్టడంతో అనేక అనుమానాలూ, సందేహాలూ, ముఖ్యంగా దక్షి ణాది రాష్ట్రాలలో బయటపడటం అందరూ గమనించారు! చెప్పిన విధంగా కేంద్రం చేయటం లేదన్నది రాజకీయ పక్షాలలో చర్చనీయాంశంగా మారింది! అందువల్లే ‘బిల్లు’ ముందుకు పోలేదు. బిల్లు పెట్టబోయే ముందు చెప్పిన విషయాలకు, బిల్లు పెట్టిన తర్వాత అందు లో వున్న అంశాలకు పొంతన లేకపోవటంతో బిల్లుకు చల నం లేకుండా పోయింది! బిల్లు ఆమోదించబడాలంటే 850 సీట్లకు లోక్సభలో పెంచుతే దానిని రాష్ట్రాల శాసన సభల్లో ప్రతిబింప చేయటానికి రాజ్యాంగ సవరణ అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్రాల మధ్య సఖ్యతను కనపర్చటం లేదు

ముఖ్య ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెసు 543 సీట్లు (ప్రస్తుతం పరిస్థితి) కే అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రాల శాసన సభలలో వున్న సంఖ్యకే కట్టుబడి వుండాలని కోరుతున్నది. రాష్ట్రాలలోని పార్టీల తీరుతెన్నులు ప్రక్కన పెట్టి ఈవిషయాన్ని విశ్లేషిస్తే, ప్రతి రాష్ట్రం కేంద్రం లో తన పలుకుబడి ఎక్కువ సీట్లు వుంటేనే సాధ్యపడుతుం దని భావిస్తున్నది! అది నిజం గూడా! ఉదాహరణకు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తన లోక్సభ సీట్లతో కేంద్రాన్ని ఏ విషయంలోనైనా ప్రభావితం చేసే శక్తి వుండేది. ఇప్పుడు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వున్నప్పటికిని ఆ పరిస్థితి లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! దక్షిణాది రాష్ట్రా లలో తమిళనాడు తమ రాష్ట్రంలో ప్రస్తుత లోక్ సభ సీట్ల సంఖ్యే వుండాలని, ఆవిధంగానే డీలిమిటేషన్ జరగాలని సంకేతాలిస్తున్నది! ఈ విషయంలో ఆ రాష్ట్రం స్పష్టత కోరుతున్నది కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున సంప్రదింపులు జరుపుతున్న మంత్రి కిరణ్ రిజిజు ఆ విషయంలో స్పష్టత ఇవ్వటం లేదు! ఏది ఏమైనా డీలిమిటేషన్ సమస్య కేంద్రం రాష్ట్రాల మధ్య సఖ్యతను కనపర్చటం లేదు. ఈ ప్రభుత్వం నాదీ అన్న భావన రాష్ట్రాలలోని ప్రజలకు వచ్చినప్పుడే ఫెడరల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిధిలో ఆమోదయోగ్యంగా వుంటుంది. అది లేని నాడు ఇతర దేశాల మాదిరి అన వసరపు అంతర్గతసమస్యలకు తావిచ్చినట్లవుతుంది.

Delimitation
Delimitation

భిన్న త్వంలో ఏకత్వం మన దేశం ప్రత్యేక!

అదృష్ట వశాత్తు మన ప్రజలూ ప్రభుత్వాలూ, ప్రతిపక్షాలూ అంత దూరం పోనివ్వరని సామాన్యులు అనుకుంటున్నారు. భిన్న త్వంలో ఏకత్వం మన దేశం ప్రత్యేక! ఆ ప్రత్యేకతను అధి కారం అన్నివేళలా నిలుపుకోటానికి రాజకీయ పార్టీలు గిమ్మిక్కులు డీలిమిటేషన్ రూపంలో చేస్తాయని ఎవరూ భావించ టం లేదు! ప్రధాని మోడీనాయకత్వంలో ఎన్.డి. యేకూటమి మన దేశానికి అంతర్జాతీయ పరిధిలో, క్లిష్ట సమయంలో కూడా అన్ని దేశాలూ ఆశ్చర్యపడే రీతిలో స్థిరమైన ప్రజా స్వామ్యంగా నిరూపించుకున్నది! ‘ఎమర్జెన్సీ’ తప్పని ఓడి పోవటానికి సిద్ధపడిన పార్టీ కాంగ్రెసు, ఎన్నో సంవత్సరాలు దేశాన్ని ఒడిదుడుకులకు లోనుకాకుండా నడపగలిగింది! అందుకనే భారత్లోని ప్రజలు శక్తియుక్తులతో ప్రభుత్వాలను ఎంపిక చేస్తున్నాయి! సమస్యలు ఎంత క్లిష్టంగా వున్నా అధి గమించే శక్తి దేశంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలకుఉందనీ, సరియైన సమయంలో దేశం విచ్ఛిన్నం కాకుండా సామరస్య ధోరణిలో అందరి సహకారంతో భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపే సత్తా ఉందని పరిపూర్ణంగా నమ్మటంలో ఎవరూ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు!

-రావులపాటి సీతారాంరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు