Virat Kohli: ప్ర‌పంచ రికార్డు సాధించిన విరాట్ కోహ్లి

Follow Us: Google News Daily Hunt
Virat Kohli: ప్ర‌పంచ రికార్డు సాధించిన విరాట్ కోహ్లి
FONT SIZE
GET APP

Virat Kohli: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి మైదానంలోకి అడుగుపెడితే చాలు.. ఏదో ఒక రికార్డు బద్దలవ్వాల్సిందే. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లి మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో మూడో స్థానంలో (బ్యాటింగ్‌కు వచ్చి 13,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Read also: Arshdeep Singh:వికెట్ తీసిన ప్రతిసారీ ఆ డ్యాన్స్ ఎందుకో తెలుసా? అసలు విషయం చెప్పిన అర్ష్‌దీప్!

ఒత్తిడిలోనూ


ఈ మ్యాచ్‌కు ముందు మూడో స్థానంలో 13,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లికి కేవలం 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. 186 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రన్ ఏమీ చేయకుండానే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడంతో కోహ్లి తొలి ఓవర్‌లోనే క్రీజులోకి రావలసి వచ్చింది. కైల్ జేమీసన్ వేసిన బంతిని థర్డ్ మ్యాన్ దిశగా సింగిల్ తీసి, తాను ఎదుర్కొన్న 13వ బంతికి విరాట్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో అంతకుముందు భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు పడగొట్టినప్పటికీ 70 పరుగులు ఇచ్చాడు. అయితే యువ బౌలర్ అన్షుల్ కంబోజ్ అత్యంత కచ్చితత్వంతో బౌలింగ్ చేసి, తన 10 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు.

రికీ పాంటింగ్ రికార్డు బ్రేక్‌


వన్డేల్లో మూడో స్థానం అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్. పాంటింగ్ తన కెరీర్‌లో మూడో స్థానంలో 330 ఇన్నింగ్స్‌ల్లో 42.48 సగటుతో 29 సెంచరీలు, 74 అర్ధసెంచరీలతో 12,662 పరుగులు చేశాడు. అయితే, ఈ ఏడాది జనవరిలో ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలోనే కోహ్లి, పాంటింగ్ రికార్డును అధిగమించాడు.

ఇప్పుడు కేవలం 251 ఇన్నింగ్స్‌ల్లోనే 61.61 సగటుతో, 48 సెంచరీలు 69 హాఫ్ సెంచరీలతో 13,000 పరుగుల మార్కును దాటేశాడు. పాంటింగ్ కంటే 79 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి, ఆయన కంటే 300కు పైగా పరుగులు ఎక్కువుగా సాధించడం కోహ్లి స్థిరత్వానికి అద్దం పడుతోంది.

మిగతా దిగ్గజాల కంటే ఎంతో ముందు..

వన్డే చరిత్రలో మూడో స్థానంలో 10,000కు పైగా పరుగులు చేసిన ఘనత కేవలం విరాట్ కోహ్లి, రికీ పాంటింగ్‌లకు మాత్రమే సాధ్యమైంది. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 238 ఇన్నింగ్స్‌ల్లో 9,747 పరుగులు చేశాడు. సంగక్కర కంటే కోహ్లి కేవలం 13 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఎక్కువగా ఆడి, ఏకంగా 3,200 కంటే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also

Keerthi

రచయిత గురించి

Keerthi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు