Water : ప్రతి చుక్కను పొదుపు చేయాలి. తెలంగాణ మళ్లీ నీటి పరీక్షను ఎదుర్కొంటోంది. వర్షాలు తగ్గాయి. జలాశ యాల్లో నిల్వలు క్షీణిస్తున్నాయి. భూగర్భ జలాలు అడు గంటుతున్నాయి. రాబోయే వేసవిని తలుచుకుంటేనేప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం, అధికారులు ప్రజలకు ఒకే సందేశం ఇస్తున్నారు. నీటిని పొదుపు చేయండి అని. ఆ సందేశం సరైనదే. కానీ ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. నీటిని పొదుపు చేయాల్సింది కేవలం సామాన్యుడేనా?. ఇటీవలి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు తెలంగాణలో సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గింది, ప్రధాన, మధ్యతరహా జలాశయాల్లో ఉపయోగిం చదగిన నీటి నిల్వలు సాధారణ స్థాయితో పోలిస్తే తీవ్రం గా తగ్గాయి. హైదరాబాద్కు కీలకమైన సింగూరు జలాశ యంలో పూర్తిసామర్థ్యంతో పోలిస్తే నిల్వలు అత్యల్పస్థాయి కి చేరాయి. అందుబాటులోని నీటిలో మొదటి ప్రాధాన్యం తాగునీటికే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమ యంలో ఒక కుటుంబానికి సగం నీరు మాత్రమే ఇవ్వడం, షవర్కు బదులు బకెట్ స్నానం చేయడం, లీకేజీలను అరి కట్టడం తప్పనిసరి. కానీ ప్రజలపై పొదుపుప్రచారం చేస్తూ నే, మరోవైపు భారీగా నీటిని వినియోగించే పరిశ్రమలకు ఎలాంటి ప్రమాణాలు లేకుండా అవకాశాలు కల్పిస్తే అది సమగ్ర నీటి విధానం ఎలా అవుతుంది?
Read Also : Groundwater Level: వికారాబాద్‌లో అడుగంటిన భూగర్భ జలాలు

Water : నీటి వినియోగంలో బాధ్యత
బీరు, పానీయ పరిశ్రమలది. బీరు తయారీలో నీరు ప్రధాన ముడిసరుకు మాత్రమే కాదు, శుభ్రపరిచే ప్రక్రియలు, శీతలీకరణ వంటి అనేకదశల్లో కూడా నీరు అవసరం. నీటి ఎద్దడి ప్రాంతాల్లో ఇటువంటి పరిశ్రమలు ఎంత నీటిని వినియోగిస్తున్నాయి? ఆ నీరు నదుల నుంచి వస్తోందా, భూగర్భజలాల నుంచి వస్తోందా? వాటి వినియోగ వివరాలు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండకూడదు? హైదరాబాద్ను డేటా సెంటర్ల కేంద్రంగా తీర్చి దిద్దడం ఆర్ధికం గా అవసరమే. పెట్టుబడులు, ఉపాధి, సాంకేతిక అభివృద్ధి, అన్నీ రాష్ట్రానికి అవసరమై నవే. అయితే, కొన్నిసంప్రదాయ శీతలీకరణ పద్ధతులు గణనీయమైన నీటిని వినియోగిస్తాయి. 5గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం వంటి భారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్న ప్పుడు, వాటి నీటి అవసరాలపై ముందస్తు లెక్కలు, ప్రజా చర్చ జరగకూడదా? ఇక్కడ పరిశ్రమలకు వ్యతిరేకత కాదు సమస్య. నీటి వినియోగంలో బాధ్యత, పారదర్శకత కావా లన్నదే అసలు డిమాండ్. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు స్వాగతించదగ్గవే. శుద్ధిచేసిన మురుగు నీటిని వరి శ్రమలు, డేటా సెంటర్లకు సరఫరాచేయడం వంటి ప్రత్యా మ్నాయాలపై దృష్టి పెట్టడం సరైన దిశ. నీటి రహిత లేదా తక్కువ నీటి శీతలీకరణ సాంకేతికతలను ప్రోత్సహిం చడం కూడా అవసరం. కానీ ఇవి కేవలం ప్రణాళికలుగా కాకుండా అనుమతులకు ముందస్తు షరతులుగా మారాలి.

నగరాల్లోనీటి సరఫరా పై ఆంక్షలు
తెలంగాణకు నీరు అపరిమిత వనరుకాదు. కృష్ణా, గోదావరి జలా లపై ఆధారపడే రాష్ట్రం కావడంతో దీర్ఘకాల నీటి భద్రతకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. ప్రతి కొత్త భారీ పరి క్రమకు ముందుగా వాటర్ బడ్జెట్, వాటర్ ఆడిట్, శుద్ధిచేసిన నీటి వినియోగం, వర్షపు నీటిసంరక్షణ వంటి ప్రమాణాలు తప్ప నిసరి చేయాలి. సామాన్యుడికి మాత్రం ఒక్క చుక్క కూడా వృథా చేయొద్దు అనిచెప్పి, పెద్ద వినియోగదారుల కు మినహాయింపులు ఇవ్వడం న్యాయం కాదు. ఒక వైపు రైతుకు సాగునీటిలో కోత, మరోవైపు నగరాల్లోనీటి సరఫరా పై ఆంక్షలు, ఇదేసమయంలో పరిశ్రమల నీటి వినియోగం పై పూర్తి లెక్కలు ప్రజలకు తెలియకపోతే ప్రశ్నలు రావడం సహజం. నీటి కరవు ప్రకృతి విపత్తు కావచ్చు. కానీ నీటి కొరతను మరింత తీవ్రం చేసే విధానపరమైన తప్పిదాలకు మనమే బాధ్యులం. అందుకే ఈ సంక్షోభంలో ఒకే సూత్రం ఉండాలి. పొదువు సామాన్యుడి బాధ్యత మాత్రమే కాదు, జవాబుదారీతనం ప్రభుత్వానిది, సంయమనం పరిశ్రమల ది. నీటి ప్రతి చుక్కకు విలువ ఉన్న తెలంగాణలో, ఇంట్లో ని కు ళాయిని మాత్రమే కాదు, పరిశ్రమల నీటి పైపులనూ ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది.
-కొలను వెంకటేశ్వర రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: