AP Parishad Elections: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన

Follow Us: Google News Daily Hunt
In the wake of cyclone-related rains in Andhra Pradesh, the State Election Commission (SEC) reviewed the situation regarding the Zilla and Mandal Parishad elections. It announced that the elections would proceed as scheduled.
In the wake of cyclone-related rains in Andhra Pradesh, the State Election Commission (SEC) reviewed the situation regarding the Zilla and Mandal Parishad elections. It announced that the elections would proceed as scheduled.
FONT SIZE
GET APP

AP Parishad Elections: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు యథావిధిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.

Read Also :MPTC, ZPTC Elections: రేపే ఏపీలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్

AP Parishad Elections

AP Parishad Elections: ఈ సమావేశంలో జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, వర్షాల ప్రభావం, పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లను ఎస్ఈసీ వివరాలు అడిగి తెలుసుకుంది. వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని, కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు నివేదించారు. కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ఏపీలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్ణయించిన ప్రకారమే కొనసాగనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు