Immortal movie: జీవీ ప్రకాశ్ ‘ఇమ్మోర్టల్’ మూవీ రివ్యూ

Follow Us: Google News Daily Hunt
Immortal movie
Immortal movie
FONT SIZE
GET APP

Immortal movie: తమిళంలో రూపొంది, ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్‘. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో జీవీ ప్రకాశ్ కుమార్, అందాల భామ కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీ లివ్’ (SonyLIV)లో తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Read Also : Actress Tabu Birthday: నటి టబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జాకీ ష్రాఫ్

Immortal movie
GV Prakash’s ‘Immortal’ Movie Review

Immortal movie: కథ

మహి (జీవీ ప్రకాశ్ కుమార్) తన మేనమామ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తుంటాడు. ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తుండటంతో మరో సింగిల్ రూమ్ కోసం వెతుకుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఫ్లాట్ లో షేరింగ్ కి అవకాశం ఉందంటూ ‘సింధు’ (కయాదు లోహర్) నుంచి కాల్ వస్తుంది. దాంతో అతను ఆమె ఫ్లాట్ లోకి మకాం మారుస్తాడు. ఖరీదైన ఫ్లాట్.. అందులోనూ అందమైన అమ్మాయితో కలిసి రూమ్ షేర్ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తాడు.

అయితే సింధు ఏ పనీ చేయకపోవడం, వంట చేయకపోయినా తనకు నచ్చిన ఫుడ్ అప్పటికప్పుడు ప్రత్యక్షమవడం మహిని ఆశ్చర్యపరుస్తుంది. సింధుతో సాన్నిహిత్యం పెరుగుతున్న తరుణంలో, ఆ ఇంట్లో ఒక వయసు మళ్లిన వ్యక్తి ఉండటాన్ని మహి చూస్తాడు. అతను తన తాతయ్య అని, ఆరోగ్యం బాగోలేదని సింధు చెబుతుంది. కానీ, సింధు లేని సమయంలో ఆ వృద్ధుడు మహికి ఒక షాకింగ్ నిజం చెబుతాడు. తాను సింధుకి తాతయ్య కాననీ, ఆమెపై మనసు పడిన ఒక డాక్టర్ నని.. అసలు సింధు ఒక సాధారణ స్త్రీ కాదనీ, ఆమెకో ‘రక్త పిశాచి’ అని హెచ్చరిస్తాడు. తనకి నచ్చిన బ్లడ్ గ్రూప్ వారిని ట్రాప్ చేసి రక్తదాహం తీర్చుకోవడమే ఆమె పని అని, వెంటనే అక్కడి నుంచి పారిపోమ్మని చెబుతాడు. మరి ఈ ఉచ్చులో చిక్కుకున్న మహి ఏం చేశాడు? ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? అనేది అసలు కథ.

సినిమా విశ్లేషణ

సినిమా ప్రథమార్థం ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే ఓ బ్యాచిలర్ కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అతడి జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి రావడం, ఆమె అందానికి ఆకర్షితుడైన హీరో ప్రేమలో పడటంతో ఫస్టాఫ్ రొమాంటిక్‌గా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ పూర్తిగా మరో మలుపు తీసుకుంటుంది. తాను ఓ రక్తపిశాచి బంగ్లాలో చిక్కుకున్నాననే నిజం హీరోకు తెలియడంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి బయటపడేందుకు అతడు చేసే ప్రయత్నాలు ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠను పెంచుతాయి.

ఇక ఈ సినిమాలో ఫ్లాట్ లోపల, బయట కలిపి మొత్తం ఆరు పాత్రలే కనిపిస్తాయి. కయాదు లోహర్ అందంతో పాటు తన నటనతోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆమె గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాంకేతికంగా చూస్తే అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ మంచి విజువల్ అనుభూతిని అందించింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం భయానక సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. రాజేశ్ ఎడిటింగ్ కూడా కథనం వేగంగా ముందుకు సాగేందుకు దోహదపడింది.

మొత్తంగా నాలుగు గోడల మధ్య, పరిమిత పాత్రలతో నడిచే సరికొత్త హారర్ థ్రిల్లర్ అనుభూతిని కోరుకునే వారికి ‘ఇమ్మోర్టల్’ మంచి ఆప్షన్ అవుతుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు