ఘనంగా రెసోనెన్స్ కళాశాల ‘రెసోఫెస్ట్’

హైదరాబాద్, రెసోనెన్స్ కళాశాల వార్షిక ఉత్సవం ‘రెసోఫెస్ట్’ గచ్చిబౌలి స్టేడియంలో రెండో రోజూ కొనసాగింది. రెండో రోజు ఉత్సవంలో వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, సినీ నటుడు మురళీ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‌రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రెసోనెన్స్ హైదరాబాద్ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌తో పాటు వివిధ ఇంజనీరింగ్, మెడికల్, కామర్స్, లా ప్రవేశ పరీక్షల శిక్షణలో అత్యుత్తమ సంస్థ అన్నారు.‌ ఈ రెసోఫెస్ట్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక‌ అవకాశమన్నారు. రోజువారీ చదువుల నుంచి అవసరమైన విశ్రాంతిని అందిస్తుందన్నారు. విద్యార్థులు అత్యంత కీలకమైన పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు మరింత ఉత్సాహంతో ముందడుగు వేసేందుకు ఒక అవకాశమని తెలిపారు. అత్యుత్తమ అకడమిక్ పని తీరును కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు కూడా ఇదొక అవకాశమని పేర్కొన్నారు. అన్ని బ్రాంచ్‌లలో పోటీలు నిర్వహించామన్నారు. విజేతలందరితో గ్రాండ్ ఫినాలేను ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు.

రెసోనెన్స్ హైదరాబాద్ కేంద్రం జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్‌డ్, ఇతర ఇంజినీరింగ్, మెడికల్, కామర్స్, లా ప్రవేశ పరీక్షలలో ప్రథమ స్థానంలో ఉంది. వివిధ క్యాంపస్‌ల నుంచి రెసోనెన్స్‌ విద్యార్థులు ఐదు వేల మంది హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షలకు ముందు అకడమిక్ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఈ రంగుల సాంస్కృతిక మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆట పాటలతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు.

ఈ రెసోఫెస్ట్ మొదటి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది. రెసోనెన్స్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, వైద్య కళాశాలల టాపర్‌లకు రెసోఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక, క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. మొదటి రోజు కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, బొల్లంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు బొల్లా శ్రీకాంత్, కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు భాస్కర్ రావు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, నటుడు శ్రీ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

రెసోనెన్స్ గురించి:

రెసోనెన్స్ గత 23 సంవత్సరాల నుంచి విద్యా రంగంలో విజయవంతమైన, జనాదరణ పొందిన బ్రాండ్. రెసోనెన్స్ రాజస్థాన్‌లో కోటలో 11, ఏప్రిల్ 2001లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోని 76 నగరాల్లో ఉంది. ప్రారంభంలో ఐఐటీ – జేఈఈ నీట్ ఇతర పోటీ పరీక్షల కోసం పది లక్షలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. 2018 నుంచి ఎంఆర్ ఆర్కే వర్మ సర్ రెసోనెన్స్ వ్యవస్థాపకులు పూర్ణచంద్రరావు నర్రాతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెసోనెన్స్ విద్యా సంస్థలను స్థాపించారు. తక్కువ వ్యవధిలో రెసోనెన్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక ముఖ్యమైన విద్యా సంస్థగా అవతరించడంలో అద్భుతమైన విజయాన్ని, విస్తృత ప్రజాదరణను పొందింది.

రెసోనెన్స్ ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలను నడుపుతుంది. పది వేలకు పైగా విద్యార్థులు 40 క్యాంపస్‌లలో బహుళ కోర్సులను అభ్యసిస్తున్నారు. హైదరాబాద్‌లో 30 క్యాంపస్‌లు కలవు. ఐఐటీ – జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలలో విజయం కోసం రెసోనెన్స్ గమ్యస్థానంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *