సోషల్ మీడియా విషయంలో తగ్గేదేలే అంటున్న రోజా

roja

సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని YCP నేత ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీల‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌కుండా మోసం చేసింద‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. బడ్జెట్‌లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు నిధులు ఎగ్గొట్ట‌డం మోసం కాదా చంద్ర‌బాబు అంటూ ఆమె నిల‌దీశారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చంద్ర‌బాబుపై 420 కేసు ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని ఆమె ట్వీట్ చేశారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఆమె నిలదీశారు. ‘రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చేశారు. మహిళలకు రూ. 1,500, విద్యార్థులకు రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు, యువతకు రూ.3 వేలు ఎగ్గొట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం’ అని ఆమె ట్వీట్ చేశారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆచరణలో పెట్టకపోవడం, ప్రజలను మోసం చేసినట్లే అని రోజా పేర్కొన్నారు. మీరు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా మహిళలకు, యువతకు, రైతులకు ఇచ్చిన ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణం, మరియు ఇతర సామాజిక సంక్షేమ పథకాలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు.ఈ హామీల విషయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మరియు సామాజిక మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెడుతూనే ఉంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Consolidated bank ghana achieves record gh¢1 billion revenue in q3 2024. Por fim, o acompanhamento contínuo é uma estratégia essencial para prevenir recaídas. 禁!.