సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు..ఇదేనా అధికారుల తీరు

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey) ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. గత వారం ఈ సర్వేను ప్రారంభించింది. ప్రతి రోజు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ప్రక్రియలో ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మరియు అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. అయితే ఈ సర్వే ఫారాలు రోడ్ల పై చిత్తూ కాగితాల్లా పడిఉండడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు పడివున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లి అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమైన కమిషనర్ ను వివరణ కోరగా జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే పడి ఉన్నట్లు తనకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి, దరఖాస్తులను సేకరించామన్నారు. అర్ధ కిలో మీటర్ మేరకు దరఖాస్తు ఫారాలు పడి ఉన్నాయని చెప్పారు. మరి ఈ ఫారాలు ఎవరన్న పడేశారా..? పొరపాటున పడిపోయాయ..? అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *