Prabhas Prashanth Varma : ఏంటి అస్సలు ఊహించలేదే.. ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోనా

Prabhas Prashanth Varma

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో చెప్పడం కష్టమనే విషయం అందరికీ తెలిసిందే పెద్ద చిన్న అనే తేడా లేకుండా కేవలం కథ నచ్చితే ప్రభాస్ వెంటనే అవకాశాన్ని ఇవ్వడం అతని ప్రత్యేకత బాహుబలి వంటి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా తర్వాత సుజీత్‌తో సాహో రాధాకృష్ణతో రాధే శ్యామ్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో ఆదిపురుష్ చేశాడు ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో సలార్ నాగ్ అశ్విన్‌తో కల్కి ప్రాజెక్టులపై ఉన్న ప్రభాస్ మారుతితో రాజాసాబ్ హనురాఘవపూడితో ఫౌజీ మరియు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాలకు సంతకం చేశాడు ప్రభాస్ సినిమాల లైనప్ ఎంతగానో ఆసక్తికరంగా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ తర్వలో మరో కొత్త దర్శకుడితో సినిమా చేసే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈసారి అతనితో సినిమా చేయబోతున్నది యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అని వార్తలు వినిపిస్తున్నాయి హనుమాన్ వంటి పాన్ ఇండియా చిత్రంతో తన సత్తా చాటిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.

ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా జై హనుమాన్ మహాకాళి అధీరా వంటి చిత్రాలను కూడా ప్రకటించాడు ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి సినిమా చేయబోతున్నారని సమాచారం అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ వార్తలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి గతంలో ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యం వల్ల ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌పై ఆశలు పెట్టుకోవడం ఆశ్చర్యకరమైన విషయం కాదు ఇప్పటికే టాలీవుడ్ వర్గాల ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం ఒక సూపర్ హీరో కథ రాసుకున్నాడనే టాక్ ఉంది కానీ ప్రభాస్ ఏ ప్రాజెక్ట్‌కైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా ముందుకువచ్చే వరకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఈ కాంబినేషన్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇది కేవలం రూమర్‌గా మాత్రమే ఉంది. మరి ఈ రూమర్ నిజమవుతుందా లేదా అనేది కాస్త వేచి చూడాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: